Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆయనో 'దబాంగ్' ప్లేయర్'.. ధోనీ నా అభిమాన క్రికెటర్: సల్మాన్ ఖాన్

My Favourite Cricketer is MS Dhoni, He is a Dabangg Player, Says Salman khan


ముంబై: టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ ఆరంగేట్రం నుంచి ఇప్పటివరకు తన బ్యాటింగ్, కీపింగ్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌ (2007, 2011)లు టీమిండియాకు అందించి అభిమానుల గుండెల్లో నిలిచాడు.
 ధోనీ అభిమానులే ఎక్కువ:

ధోనీ అభిమానులే ఎక్కువ:

ఎంఎస్ ధోనీకి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇక మన దేశంలోని సెలబ్రిటీల్లో ఎక్కువ మంది ధోనీ అభిమానులే అనడంలో అతిశయోక్తి లేదు. ఇదే విషయం మరోసారి రుజువైంది. ధోనీ తన ఫేవరేట్ క్రికెటర్ అని తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ 'సల్మాన్ ఖాన్' చెప్పారు.

 ధోనీ నా అభిమాన క్రికెటర్:

ధోనీ నా అభిమాన క్రికెటర్:

సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'దబాంగ్-3'. ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోసన్స్‌లో సల్మాన్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్‌ నిర్వహించే 'క్రికెట్ లైవ్' కార్యక్రమంలో సల్మాన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేదార్ జాదవ్‌తో తనకున్న అనుబంధాన్ని తెలిపారు. ఇక ధోనీ తన అభిమాన క్రికెటర్ అని చెప్పారు. అంతేకాదు ధోనీ 'దబాంగ్' ప్లేయర్' అని సల్మాన్ పేర్కొన్నారు. ధోనీ ప్రస్తుతం క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.

బాగా ఆడిన వాళ్లని ఇష్టపడతా:

బాగా ఆడిన వాళ్లని ఇష్టపడతా:

ఇదే కార్యక్రమంలో దబాంగ్-3 విలన్ 'కిచ్చ' సుదీప్‌ కూడా పాల్గొన్నారు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే.. వాళ్లే తన అభిమాన ఆటగాడు అని సుదీప్ తెలిపారు. 'నాకు అభిమాన క్రికెటర్ అంటూ ఎవరూ లేరు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్లని ఇష్టపడతా. అంతేకాక.. ఒక అభిమానిగా ప్రతి ఒక్క ఆటగాడిని గౌరవించాలని నేను భావిస్తా. అయితే నేను ఎప్పటికీ ఇష్టపడేది అనిల్ కుంబ్లేని, రోహిత్ శర్మ అంటే కూడా ఇష్టమే' అని సుదీప్‌ అన్నారు.

ప్రభుదేవా దర్శకత్వం:

ప్రభుదేవా దర్శకత్వం:

దబాంగ్-3 సినిమాలోని 'చుల్ బుల్ పాండే' పాత్ర మొదటగా సల్మాన్‌కు రాలేదు. తొలుత ఈ పాత్ర పోషించే అవకాశం రణదీప్ హుడాకు దక్కింది. అయితే అర్భజ్ ఖాన్ ఈ విషయంను సల్మాన్‌తో చెప్పగా.. అతనికి ఎంతగానో నచ్చింది. ఆరేడు నెలల పాటు ఈ కథను పూర్తిగా విన్నాక.. యూటీవీ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చింది. దబంగ్ సినిమా 2010లో విడుదల కాగా.. దబంగ్-2 2012లో విడుదలయ్యింది. దబంగ్-3 సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు.

Story first published: Monday, December 16, 2019, 16:29 [IST]
Other articles published on Dec 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+