Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కూతుళ్ల విషయంలో కఠినంగా: అవన్నీ పట్టించుకోనన్న అఫ్రిది

Afridi

హైదరాబాద్: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షాహిదీ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవలే తన ఆటో బయోగ్రఫీ 'గేమ్ ఛేంజర్'లో తన అసలు వయసు బయటపెట్టి విమర్శలు పాలైన షాహిది అఫ్రిది కూతుళ్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటానని అన్నాడు. వారికి క్రికెట్‌ లాంటి ఔట్‌డోర్‌ గేమ్స్‌ ఆడడానికి పర్మిషన్‌ లేదని.... ఎంత ఎదిగినా ఇస్లాం నియమాలను గౌరవిస్తానని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని తన ఆట బయోగ్రఫీలో రాసుకొచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

షాహిద్ అఫ్రిదికి అన్షా, అజ్వా, అస్మారా, అక్సా నలుగురు పిల్లలున్నారు. వాళ్ల గురించి తన పుస్తకంలో ప్రస్తావించిన అఫ్రిది సామాజిక కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని తన కూతుళ్లు అన్షా, అజ్వా, అస్మారా, అక్షకు ఇండోర్‌ గేమ్స్‌ మాత్రమే ఆడడానికి అనుమతిస్తానని చెప్పారు. తన నిర్ణయంపట్ల స్త్రీవాదులు ఏం మాట్లాడుకున్నా తనకు అనవసరమని ఆఫ్రిది ఆ పుస్తకంలో చెప్పాడు.

"చిన్న పిల్లలు అజ్వా, అస్మారాకు డ్రెస్‌ అప్‌(నిండుగా వస్త్రాలు ధరించి) ఆట అంటే ఇష్టం. ఎటువంటి ఇండోర్‌ గేమ్స్‌ అయినా ఆడుకోవడానికి వాళ్లకు నా అనుమతి ఎప్పుడూ ఉంటుంది. కానీ, ఔట్‌డోర్‌ గేమ్స్‌ ఆడేందుకు వెళతానంటే మాత్రం వాళ్లను నేను అనుమతించను. నా పిల్లలను క్రికెట్‌ ఆడేందుకు, బహిరంగ ప్రదేశాల్లో పోటీపడే ఆటలకు నేను ఒప్పుకోను. స్త్రీవాదులు నాగురించి ఏమైనా అనుకోవచ్చు. నేను అవన్నీ పట్టించుకోను" అని అఫ్రిది తెలిపాడు.

దీంతోపాటు తన ఆటోబయోగ్రఫీలో కాశ్మీర్‌ వివాదంపతోపాటు, పాకిస్తాన్‌ ఆటగాళ్లపైన, పాక్‌ క్రికెట్‌ మాజీ కోచ్‌ జావేద్‌ మియాందాద్‌పైనా అఫ్రిది విమర్శలు చేశారు. 2010లో పాకిస్తాన్‌ క్రికెట్‌లో వెలుగుచూసిన స్పాట్‌ఫిక్సింగ్‌ వ్యవహారంపై జాగ్రత్తగా ఉండాలని జూనియర్లకు సూచించిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, May 12, 2019, 19:46 [IST]
Other articles published on May 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+