Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా పేరులా.. ఇంకెన్నిసార్లు?: రిటైర్మెంట్‌పై ధోనీ ఆగ్రహం

కోల్‌కతా: రిటైర్మెంట్ పైన పదేపదే ప్రశ్నిస్తుండటం ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆగ్రహం తెప్పిస్తోంది. తాజాగా, ఆదివారం నాడు ఆయనను రిటైర్మెంట్ పైన ప్రశ్నించినప్పుడు ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలని అభిప్రాయపడ్డాడు.

ఇప్పట్లో తనకు రిటైరయ్యే ఉద్దేశం లేదని, ఎక్కడ అడిగినా, ఎన్నిసార్లు అడిగినా తన సమాధానంలో మార్పు ఉండదని పునరుద్ఘాటించాడు. ఇంకా తగినంత సమయం తాను క్రికెట్‌ ఆడతానన్నాడు. ప్రతి వేదికపైనా రిటైర్మెంట్‌పై తనను ప్రశ్నించడంపై ధోని అసహనం వ్యక్తం చేశాడు.

ఇంకొంత కాలం క్రికెట్లో కొనసాగాలన్న తన ప్రణాళికలో మార్పుండదన్నాడు. నేను నెల కింద లేదా 15 రోజుల కింద ఒక విషయం చెప్పానంటే ఇప్పుడు అందులో మార్పు ఉండదనే అర్థమని, ఎక్కడ అడిగినా సమాధానం అదేనని, నీ పేరు ఏంటి అని అడిగితే.. ధోని అని ఎలాగైతే చెబుతానో ఇది కూడా అలాగే రిటైర్మెంట్ పైన ఇంకొంత కాలం అదే సమాధానం ఉంటుందన్నాడు. నేను ఇప్పట్లో రిటైరవ్వనన్నాడు.

My answer will not change: MS Dhoni on retirement

ఆదివారం ఆసియాకప్‌ కోసం భారత జట్టు బయల్దేరుతున్న సందర్భంగా ధోని విలేకర్లతో మాట్లాడాడు. మీకు స్వేచ్ఛ ఉంది కదా అని అన్నీ అడగడం సరికాదని, ఏం చేయాలి, ఎందుకు చేయాలని విశ్లేషించుకోవడం ముఖ్యమని, ప్రశ్నించేందుకు వేదిక దొరికిందంటే దానర్థం అడిగిన ప్రశ్నే మళ్లీ మళ్లీ అడగొచ్చని కాదన్నాడు.

ఏం జరిగినా భారత్‌లో ప్రశ్నలు తలెత్తుతాయని, ఒకవేళ మేం అలవోకగా ప్రపంచ కప్‌ గెలిస్తే మా జట్టు మరీ తొందరగా అత్యుత్తమ ఫామ్‌ను అందుకుందా అని అడుగుతారని. ఫైనల్లో ఓడితే ఒత్తిడిని తట్టుకోలేకపోయారా అని ప్రశ్నిస్తారని, ఫైనల్‌ చేరలేకపోతే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కొరవడిందా అంటారని, నేనైతే ప్రశ్నలు అడగకుండా జనాన్ని ఆపలేనని, మంచి ప్రశ్నలు అడిగితే మాత్రం నూరు శాతం సమాధానమిస్తానన్నాడు.

మేం ఇటీవల ఆస్ట్రేలియాతో, శ్రీలంకతో ఆడామని చెప్పాడు. ఈ ఫార్మాట్లో నిలదొక్కుకునే సమయం దక్కిందన్నాడు. ఆసియా కప్‌లో ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నామన్నాడు. కెప్టెన్‌గా తన అభిప్రాయాల్లో, వ్యూహాల్లో ఏ మార్పూ ఉండదన్నాడు. అలాగే బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి వెళ్లాలనే ఆలోచన తనకు లేదన్నాడు. సందర్భాన్ని బట్టి మాత్రం ముందుకు రావొచ్చన్నాడు.

టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ బాదేసిన న్యూజిలాండ్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కలమ్‌పై ధోని ప్రశంసలు కురిపించాడు. అతడి ఇన్నింగ్స్‌ నేను చూడలేదని, అంతకుముందు చూశానని, మెక్‌కలమ్‌ అద్భుతమైన క్రికెటర్ అన్నాడు. తొలి బంతి నుంచే అలరిస్తాడని, అతడితో డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకోవడం తన అదృష్టమన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+