నా తొలి వికెట్ స్టీవ్ స్మిత్: ఆసీస్‌ను ఎలా ఔట్ చేస్తారనే ప్రశ్నకు బుమ్రా క్లాసిక్ రెస్పాన్స్!

హైదరాబాద్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను ఎలా ఔట్ చేస్తావని అడిగిన ప్రశ్నకు టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. వన్డేల్లో తన తొలి వికెట్ స్టీవ్ స్మితేనని చెప్పాడు. వెన్నునొప్పితో నాలుగు నెలలు జట్టుకు దూరమైన బుమ్రా ఆదివారం శ్రీలంతో గౌహతి వేదికగా జరిగే తొలి టీ20లో ఆడనున్నాడు.
ఈ సందర్భంగా శుక్రవారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో బుమ్రా మాట్లాడుతూ "ఎవరైనా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఆడుతుంటే నేను ఓపికతో ఉండాలనే ప్రయత్నిస్తా. టెస్టు మ్యాచ్ అనేది చాలా సహనంతో కూడిన ఆట. బ్యాట్స్‌మెన్ తప్పులు చేసేదాకా వేచి చూడాలి. ఎవరైతే ఓపిక కోల్పోతారో వారే తప్పులు చేస్తారు. తద్వారా మూల్యం చెల్లించుకుంటారు" అని అన్నాడు.

చాలా రోజుల విరామం తర్వాత
చాలా రోజుల విరామం తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు చాలా బాగుందని చెప్పాడు. "విరామ సమయంలో నా శరీరం బాగా స్పందించింది. ఎప్పుడైనా జట్టులోకి తిరిగి వెళ్లినప్పుడు అక్కడున్న వారిని చూస్తే మరింత రాణించాలని అనిపిస్తుంది. అప్పుడు వికెట్లు తీయాలనే కసి పెరుగుతుంది" అని బుమ్రా వెల్లడించాడు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం గువాహటి వేదికగా తొలి టీ20 జరగనుంది. కొత్త ఏడాదిని టీమిండియా టీ20లతో ఆరంభించనుంది. బుమ్రా తిరిగి జట్టులోకి రావడం టీమ్‌ఇండియాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. లసిత్ మలింగ సారథ్యంలోని శ్రీలంక క్రికెట్ టీమ్ గురువారమే భారత్ చేరుకుంది.
శుక్రవారం కోచ్‌ల పర్యవేక్షణలో
శుక్రవారం కోచ్‌ల పర్యవేక్షణలో కొంతమంది ఆటగాళ్లు నెట్‌ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత పునరాగమనం చేసిన బుమ్రా బౌలింగ్ సాధన చేశాడు. మహ్మద్ షమీ, దీపక్ చాహర్ జట్టులో లేకపోవడంతో బుమ్రాతో కలిసి నవదీప్ సైనీ పేస్ విభాగంలో సత్తాచాటేందుకు ఎదురుచూస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications