
హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టుతో తలపడి రెండు టెస్టుల్లోనూ ఘోరపరాజయం చవిచూసిన భారత జట్టు సారథి మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందించాడు. ఇందులో తను చేసిన 153 పరుగుల స్కోరు ఎందుకు పనికిరాలేదంటూ తీసిపడేశాడు.
1. బౌలర్లు తమ స్థాయిలో మెరుగ్గానే ఆడారు. బ్యాట్స్‌మెన్‌ల విషయానికొచ్చే సరికి చక్కని భాగస్వామ్మాన్ని నెలకొల్పలేకపోయారు.
2. మేము ఇక్కడకు వచ్చింది. ఇలా ఆడదాం అని కానే కాదు. మేము జట్టు కోసం ఖచ్చితంగా 120శాతం కష్టపడతాం. ప్రతి సెకనూ బాల్ వేయడానికి, బాల్ కొట్టడానికి, బాల్‌ను ఫీల్డ్ చేయడానికే ఆలోచిస్తాం.
3. నేను నాలో ఉన్నదంతా పిచ్‌లో చూపించడానికే ప్రయత్నిస్తాను. అలాగే 150 పరుగులను చేశాను. కానీ, అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఒక జట్టుగా మేము కలసికట్టుగా పోరాడేందుకే ప్రయత్నిస్తున్నాం.
4. మేము ఈ మ్యాచ్ నెగ్గితే మేము బెస్ట్ 11 అయిపోతామా..? ఫలితాలను బట్టే జట్టును నిర్ణయించగలం కానీ, అంచనాలు వేసి కాదు. మీకు తెలిస్తే మీరే చెప్పండి ఆ బెస్ట్ 11తోనే మేము ఆడతాం.
5. ఓటమి బాధకరంగానే ఉంటుంది. అలా అని చెప్పి మేము ఇక్కడే ఆగిపోం.మేము ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఒక్క గేమ్ ఓడినంత మాత్రాన ఇక్కడే ఆగిపోవాలనేం లేదుగా.
6. మీకు తెలుసా? 34టెస్ట్ మ్యాచ్‌లకు మేము ఎన్ని మ్యాచ్‌లు గెలిచామో.. మీకు తెలుసా.. ? 20మ్యాచ్‌లు గెలిచాం. రెండే మ్యాచ్‌లు ఓడాం. నేను మీతో మాట్లాడానికే ఇక్కడ ఉన్నాను. గొడవ పడడానికి కాదు.
7. మేము ఇక్కడకు కేవలం పాల్గొనడానికి మాత్రమే రాలేదు. మీకు మా మీద గెలుస్తామనే నమ్మకం లేకపోతే ఇక్కడకు వచ్చి ఇలా ప్రశ్నించరు. ఎన్ని సార్లు భారత్‌కు వచ్చి దక్షిణాఫ్రికా ఓడిపోలేదు.
8. సాధ్యమైనంత వరకు మేము జట్టుకు మంచి ప్లేయర్లనే సెలక్ట్ చేసుకుంటాం. కానీ, జట్టు మొత్తాన్ని కలిపి ఉత్తమ జట్టు అని ఎలా చెప్పగలం.
9. భువనేశ్వర్‌ను జట్టు నుంచి తప్పించినందుకు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, ఆ స్థానంలో వచ్చిన షమీ ప్రదర్శన గురించి ఎవరూ మాట్లాడరే. జరిగిన వాటి గురించి కాదు. ఒక్క మ్యాచ్ ఓడిపోయే సరికి జట్టు మొత్తాన్ని విమర్శిస్తున్నారెందుకు?
10. మేము ప్రయత్నించాం. కానీ, ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. ప్రత్యేకించి ఫీల్డింగ్ విషయంలో.. అందుకే దక్షిణాఫ్రికా విజేత అయింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.