Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తన కుమారుడి ఇష్టమైన క్రికెట్ ఎవరో చెప్పిన బ్రెట్ లీ

హైదరాబాద్: తన ఆసాధారణ ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ అభిమానుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకపోవడం విశేషం. తాజాగా తన పదేళ్ల కుమారుడు కూడా కోహ్లీకి వీరాభిమాని అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రెట్‌లీ తెలిపాడు.

ప్రస్తుతం బ్రెట్‌ లీ తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్) కోసం చెన్నైలో ఉన్నాడు. ఈ సందర్భంగా బ్రెట్ లీ మీడియాతో మాట్లాడాడు. 'నా పదేళ్ల కుమారుడు కోహ్లీకి వీరాభిమాని. ఓ సారి నేను.. కోహ్లీని కలిసినప్పుడు ఈ విషయం అతనితో చెప్పాను. వెంటనే కోహ్లీ తన టెస్టు జెర్సీపై సంతకం చేసి నా కుమారుడికి ఇవ్వమని ఇచ్చాడు' అని బ్రెట్‌ లీ తెలిపాడు.

My 10-year-old son’s favourite batsman is Virat Kohli: Brett Lee

ఇక కోహ్లీకి బౌలింగ్‌ వేయాల్సిన సమయంలో మీరు ఏమని ప్రార్థిస్తారు అని విలేకరులు అడగ్గా 'నా బౌలింగ్‌లో కోహ్లీ సిక్స్‌ బాదకుండా ఉండాలని ప్రార్థిస్తా. కోహ్లీ పవర్ పుల్ క్రికెటర్‌. మైదానంలో అన్ని వైపుల్లో బంతిని కొట్టే సామర్థ్యం అతని సొంతం. కోహ్లీ 360 డిగ్రీల ఆటగాడు' అని బ్రెట్‌ లీ పేర్కొన్నాడు.

'వన్డే క్రికెట్‌లో కోహ్లీని అవుట్ చేయాలన్నా లేక పరుగులు ఇవ్వకుండా చేయాలంటే వైడ్ లైన్ యార్కర్ వేస్తా. ఓవర్ కవర్‌లో హిట్ చేయాలని కోహ్లీ భావిస్తే వైడ్ బాల్ సంధిస్తా. కోహ్లీ ఆటతీరు నాకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీనే' అని బ్రెట్ లీ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+