సచిన్ కంటే లారాకు ఎక్కువ రేటింగ్ ఇచ్చిన మురళీ
దుబాయ్: వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారాకు బౌలింగ్ చేయడం తనకు కష్టంగా ఉండేదని శ్రీలంక లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యానించాడు. గురువారం అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను చాలా జట్లతో ఆడానని, చాలామందికి బౌలింగ్ చేశానని, అయితే బ్రయాన్ లారాకు బౌలింగ్ చేయడం చాలా ఇబ్బందిగా భావించేవాడినని చెప్పాడు. తాను శ్రీలంక తరఫున లారా (వెస్టిండీస్)కు వ్యతిరేకంగా చాలా టెస్టులు ఆడానని చెప్పారు.

స్పిన్‌ను ధాటిగా ఎదుర్కోవడంలో అతను బెస్ట్ ప్లేయర్ అన్నారు. తాను అతనిని డామినేట్ చేయలేకపోయేవాడినని, లారానే తన పైన పైచేయి సాధించేవాడన్నాడు. మురళీధరన్ 134 టెస్టులలో 800 వికెట్లు తీశాడు. యావరేజ్ 22గా ఉంది. 350 వన్డేలలో 534 వికెట్లు తీశాడు.
ఎమ్మెల్సీ (మాస్టర్స్ ఛాంపియన్ లీగ్) నేపథ్యంలో.. లారా గురించి భయపడాల్సిన అవసరం లేదని, అతను ఇప్పుడు నా కంటే వయస్సులో పెద్దవాడని ముత్తయ మురళీధరన్ చెప్పాడు. కాగా, మురళీధరన్.. సచిన్ కంటే లారాకు ఎక్కువ రేటింగ్ ఇచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications