For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండేళ్ల పాటు ఐపీఎల్లో ఆడకు: బంగ్లా బోర్డు సంచలన నిర్ణయం

By Nageshwara Rao
Mustafizur Rahman will not be available in overseas T20 leagues for next two years: BCB

హైదరాబాద్: బంగ్లాదేశ్‌ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ ఐపీఎల్‌తో పాటు విదేశాల్లో జరిగే ఇతర టీ20 లీగ్‌లకు రెండేళ్ల పాటు దూరం కానున్నాడు. ఈ మేరకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హాసన్ స్పష్టం చేశారు. విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువగా హాజరవుతున్న ముస్తాఫిజుర్ తరుచూ గాయాల పాలవుతున్నాడు.

బంగ్లా బోర్డు సంచలన నిర్ణయం

బంగ్లా బోర్డు సంచలన నిర్ణయం

దీంతో అతడు బంగ్లాదేశ్‌ జాతీయ జట్టుకు ఎక్కువగా అందుబాటులో ఉండలేకపోతున్నాడు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హాసన్ మాట్లాడుతూ "కనీసం రెండేళ్లపాటు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు అందుబాటులో ఉండొద్దని ముస్తాఫిజుర్‌కు చెప్పాను" అని అన్నారు.

లీగ్‌లు ఆడటం వల్ల అతడు గాయాల పాలవుతున్నాడు

లీగ్‌లు ఆడటం వల్ల అతడు గాయాల పాలవుతున్నాడు

"ఈ లీగ్‌లు ఆడటం వల్ల అతడు గాయాల పాలవుతున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీన్ని మేం సీరియస్‌గా తీసుకున్నాం. విదేశీ లీగ్‌ల్లో ఆడి గాయాలపాలై స్వదేశానికి వచ్చి బోర్డు ఫిజియోల సమక్షంలో కోలుకుంటున్నాడు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ విదేశాలకు వెళ్లి లీగ్‌లు ఆడి వచ్చి గాయపడుతున్నాడు" అని తెలిపారు.

 ముస్తాఫిజుర్‌ ఎంతో కీలకమైన ఆటగాడు

ముస్తాఫిజుర్‌ ఎంతో కీలకమైన ఆటగాడు

"2015లో అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్‌ దేశం తరఫున ఇప్పటి వరకు కేవలం 10 టెస్టులు, 27 వన్డేలు, 24 టీ20లు మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ విభాగంలో ముస్తాఫిజుర్‌ ఎంతో కీలకమైన ఆటగాడు. అలాంటివాడిని మేం కోల్పోవడం వల్ల జట్టుకు ఓటములు ఎక్కువవుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని హాజన్‌ అన్నారు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 24 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 24 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్

కాగా, 2016 నుంచి ముస్తాఫిజుర్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఆడుతున్నాడు. 2016, 17 రెండేళ్ల పాటు సన్‌రైజర్స్‌ హైదరబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన అతన్ని ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 24 మ్యాచ్‌లాడిన ముస్తాఫిజుర్ 24 వికెట్లు దక్కించుకున్నాడు.

Story first published: Saturday, July 21, 2018, 12:29 [IST]
Other articles published on Jul 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+