Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ 2019: బంగ్లా ఫేసర్‌కు చేదు అనుభవం

Mustafizur Rahman set to miss IPL 2019 after BCB denies giving him NOC

ఢాకా: బంగ్లా ఫేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కొన్ని సీజన్‌ల నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌లో ఆడుతూ వస్తున్న రెహ్మాన్‌.. వచ్చే ఏడాది జరగనున్న టోర్నీలో పాల్గొనే అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోయాయి. ఐపీఎల్‌లో ఆడటానికి క్లియరెన్స్‌ ఇవ్వాలంటూ ముస్తాఫిజుర్‌ చేసుకున్న విజ్ఞప్తి ఆ దేశ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) తాజాగా తిరస్కరించింది. ముస్తాఫిజుర్‌ తరుచు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌ల్లో పాల్గొంటూ గాయాల బారిన పడుతున్నాడు.

జూన్‌ నెలలో బీసీబీ నిర్ణయం

జూన్‌ నెలలో బీసీబీ నిర్ణయం

దీంతో ముస్తఫిజుర్‌ను టీ20 లీగ్‌లకు అనుమతి నిరాకరిస్తూ జూన్‌ నెలలో బీసీబీ నిర్ణయం తీసేసుకుంది. మరొకవైపు వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని కూడా ముస్తాఫిజుర్‌ను విదేశాల్లో జరిగే టీ20ల్లో పాల్గొనకుండా బీసీబీ నియంత్రిస్తోంది. ప్రధానంగా జాతీయ జట్టు ఆడే మ్యాచ్‌లకే అధిక ప్రాధాన్యత ఇ‍వ్వాలని ఇప్పటికే పలుమార్లు చెప్పిన బోర్డు.. మరొకసారి అదే విషయాన్ని ముస్తఫిజుర్‌కు తెలియజేస్తూ ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌) ఇవ్వడానికి నిరాకరించింది.

టైటిల్‌ సాధించడంలో ముస్తఫిజుర్‌ కీలక పాత్ర

టైటిల్‌ సాధించడంలో ముస్తఫిజుర్‌ కీలక పాత్ర

2016 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టైటిల్‌ సాధించడంలో ముస్తఫిజుర్‌ కీలక పాత్ర పోషించాడు . 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు సాధించి ప‍్రధాన పాత్ర పోషించాడు. అయితే 2017కు వచ్చేసరికి హైదరాబాద్‌ తరఫున కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. కాగా, 2018లో ముంబై ఇండియన్స్‌ ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకుంది. ఏడు మ్యాచ్‌లు ఆడిన ముస్తాఫిజర్‌ గాయం బారిన పడి టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు.

గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా

గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్‌ ముస్తాఫిజుర్‌ను వదలుకుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా ముంబై ఇండియన్స్‌ 10 మంది ఆటగాళ్లను విడుదల చేసిన జాబితాలో ముస్తఫిజుర్ పేరును ఉంచుంది. త్వరలో ఐపీఎల్‌ వేలం జరుగనున్న నేపథ్యంలో ముస్తఫిజుర్‌‌కు తమ దేశ క్రికెట్‌ బోర్డు నుంచి అనుకున్న ఫలితం రాకపోగా చేదు అనుభవం ఎదురైంది.

Story first published: Monday, December 10, 2018, 12:47 [IST]
Other articles published on Dec 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+