Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏడాదిన్నర బాబుతో ఛాలెంజ్, చేతులెత్తేసిన డెల్ స్టెయిన్ (వీడియో)

బెంగళూరు: ప్రపంచ నెంబర్ వన్ ఫాస్ట్ బౌలర్, సౌతాఫ్రికా ఆటగాడు డెల్ స్టెయిన్ ఓ చిన్నారితో నెగ్గలేకపోయాడు! ఏడాదిన్నర బాబుతో డెల్ స్టెయిన్ పోటీ పడి... అమ్మో ఇక నా వల్ల కాదన్నాడు! ఇందుకు సంబంధించి 4.47 నిమిషాల వీడియో ఒకటి చూడొచ్చు.

ఈ వీడియోను 'న్యూ బ్యాలెన్స్ సౌతాఫ్రికా' స్పోర్ట్స్ వేర్ కంపెనీ పోస్ట్ చేసింది. డెల్ స్టేయిన్ ఏడాదిన్నర బాలుడితో ఓ రోజంతా ఉండేందుకు సిద్ధపడ్డాడు. ఆ చిన్నారి అటూ ఇటూగా మూడు నెలల నుంచి నడుస్తున్నాడు.

ప్రస్తుతం డెల్ స్టెయిన్ ట్వంటీ 20 మ్యాచులు ఆడటం లేదు. ఆ తర్వాత జరగనున్న ఐదు వన్డేలలో సౌతాఫ్రికా జట్టుతో కలుస్తాడు. స్టెయిన్ తన ఖాతాలో 600కు పైగా వికెట్లు తీశాడు. కానీ, ఓ చిన్నారి ముందు చేతులెత్తేశాడు!

 Must-watch Video: World's No. 1 fast bowler Dale Steyn loses to a baby

32 ఏళ్ల డెల్ స్టెయిన్ ఏడాదిన్నర బాబుతో ఓ రోజంతా ఉన్నాడు. ఆ చిన్నారితో సవాల్‌కు దిగాడు. ఉదయం ఫలహారం (బ్రేక్ ఫాస్ట్)తో వారి చాలెంజ్ మొదలైంది. చిన్నారితో కలిసి ఇల్లంతా కలియతిరిగాడు. ఈ సమయంలో స్టెయిన్ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నాడని చెప్పవచ్చు.

చిన్నారి చేసిన పనులు డెల్ స్టెయిన్ చేసే ప్రయత్నాలు చేశాడు. నేను, నీళ్లు, గుడ్లు, బిస్కట్లు మొత్తం మిశ్రమం కలిపి తీసుకుంటున్నానని డెల్ స్టెయిన్ ఫలహారం తీసుకుంటున్న సమయంలో చెప్పాడు. అక్కడి నుంచి చిన్నారితో స్టెయిన్ సవాల్ ప్రారంభమైంది.

ఉదయం 6.01 నిమిషానికి వారి సవాల్ ప్రారంభమైంది. సాయంత్రం 7.12 నిమిషాలకు పూర్తయింది. చిన్నారి చేతిలో నేను ఓడిపోయానని డెల్ స్టెయిన్ (బేబీ వర్సెస్ డెల్ స్టెయిన్ కాంటెస్ట్)లో చేతులెత్తేశాడు. చిన్నారి చేసినట్లుగా అతను కూడా చేసే ప్రయత్నాలు చేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+