Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టెస్టులో సాహా 'సూపర్ మ్యాన్' క్యాచ్ చూడాల్సిందే (వీడియో)

హైదరాబాద్: పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఒక్కసారిగా 'సూపర్ మ్యాన్' అయ్యాడు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో సాహా తన కీపింగ్‌తో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు.

82వ ఓవర్‌లో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన అవుట్ స్వింగర్‌ను 9వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్ ఒకీఫ్ గట్టిగా బాదాడు. ఆ బంతి ఒకీఫ్ బ్యాట్ ఎడ్జిని తాకి వేగంగా స్టంప్స్‌కు అవతలిగా వెళుతున్న క్రమంలో కీపర్ సాహా అమాంతం డైవ్ చేసి దానిని అందుకున్నాడు.

 Must-watch video: 'Superman' Wriddhiman Saha's sensational catch

దీంతో జట్టు స్కోరు 205 పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్టీవ్‌ ఒకీఫ్‌ డకౌట్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో 81.4 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఈ అద్భుత క్యాచ్‌పై ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కోహ్లీ.. సాహాను అభినందించాడు.

ఈ సమయంలో టీవీ కామెంటేటర్, టీమిండియా మాజీ స్పిన్నర్ ఎల్ శివరామకృష్ణన్ ఈ క్యాచ్‌ని 'సెన్సేషనల్ క్యాచ్'గా అభివర్ణించాడు. ఇదిలా ఉంటే తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 94 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.

ప్రస్తుతం క్రీజులో మిచెల్ స్టార్క్ 57, జోష్ హాజిల్ ఉడ్ 1 పరుగుతో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి సెషన్‌లో కేవలం వికెట్‌ మాత్రమే కోల్పోయిన ఆసీస్ రెండు, మూడు సెషన్లలో తడబడింది. ఓపెనర్ రెన్ షా 68 పరుగులతో కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.

మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌‌కు చేరారు. చివర్లో మిచెల్ స్టార్క్(58 బంతుల్లో 57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టంతో 84 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న ఆసీస్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+