పాక్ టీవీ ఛానెల్‌లో కోహ్లీపై మాజీల ప్రశంసలు (వీడియో)
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తన ఆటతీరుతో ప్రపంచ మాజీ క్రికెటర్ల ప్రశంసల్ని అందుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఊహించని ప్రశంస ఒకటి వచ్చింది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ముగ్గురు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు.
పాకిస్థానీ టీవీ షోలో పాల్గొన్న దిగ్గజ క్రికెటర్లు మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, సక్లయిన్ ముస్తాక్, షోయబ్ అక్తర్ మాట్లాడుతూ కోహ్లీని అభినందించడానికి పదాలే లేవంటూ కొనియాడారు. క్రికెట్ పట్ల కోహ్లీకి ఉన్న అంకితం, అభిరుచిని పాక్ యువ క్రికెటర్లు సైతం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

కోహ్లీని కొనియాడిన వసీం అక్రమ్, షోయబ్ అక్తర్
ప్రపంచంలో ఓ అగ్రశ్రేణి క్రికెటర్‌గా మారేందుకు కోహ్లీ ఎంచుకున్న మార్గంపై పాకిస్థాన్ మాజీ పేసర్లు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్‌లు తెగపొగిడేశారు. 'ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్రతో చెలరేగిపోతున్న కోహ్లిని పాక్ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలని అక్తర్ పేర్కొన్నాడు.

కోహ్లీని వర్ణించడానికి పదాలే సరిపోవడం లేదు
కోహ్లి ఆటను వర్ణించడానికి పదాలే సరిపోవడం లేదని అన్నాడు. తమకు అందివచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటున్న భారత యువ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, కరుణ్ నాయర్‌లపై కూడా అక్తర్ ప్రశంసలు కురిపించాడు.

కోహ్లీకి అతనే సాటి
క్రమశిక్షణ, ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ కనబరుస్తున్న విధానం ఎంతో ముచ్చటగా ఉందని సక్లయిన్ ముస్తాక్ తెలిపాడు. 'ఒక మంచి ఉత్సాహభరితమైన క్రికెటర్ కోహ్లి. అటు జిమ్‌లోనూ, ఇటు బయట కోహ్లీకి అతనే సాటి. కఠినమైన శారీరక వ్యాయామం చేస్తూ ఆహార నియమాల్లో అత్యంత నియమంగా ఉండటం కోహ్లీకే చెల్లింది. కోహ్లీ ఫామ్ వెనుక విపరీతమైన కృషి ఉంది' అని అన్నాడు.

పాక్ ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టరు
'టీమండియా ఆటగాళ్లు సీనియర్ల సలహాలను బాగా వంట బట్టించుకుంటారు. మాజీ క్రికెట్ లెజెండ్ గవాస్కర్ యువ క్రికెటర్లకు అమూల్యమైన సలహాలు ఇస్తూ ఉంటాడు. పాక్ క్రికెట్ జట్టులో అది లేదు. ఏ క్రికెటర్ కూడా సీనియర్ సలహాల్ని తీసుకోడు. దాంతో పాటు మా ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై పెద్దగా శ్రద్ధ పెట్టరు' అని అక్రమ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications