బెంగుళూరు టెస్టు: అశ్విన్ చేతిలో వార్నర్ చెత్త రికార్డు (వీడియో)
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేయడంతో అశ్విన్ ఖాతా మరో ఘనతను సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ వేసిన 22 ఓవర్ తొలి బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు.
అశ్విన్ వేసిన ఆ బంతి లెగ్ స్టంప్ బయటపడి ఊహించని విధంగా వార్నర్ ఆఫ్ స్టంప్‌ను ఎగరేసుకుపోవడంతో ఆసీస్ 52 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. తద్వారా 12 టెస్టుల్లో ఎనిమిదిసార్లు అశ్విన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. దాంతో తన టెస్టు కెరీర్‌లో ఒకే ఆటగాడిని అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనత సాధించాడు.
వార్నర్ చెత్త రికార్డు
మరోవైపు వార్నర్ కూడా ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే బౌలర్‌కు తన వికెట్‌ను అత్యధిక సార్లు సమర్పించుకున్న అప్రతిష్టను వార్నర్ సొంతం చేసుకొన్నాడు. 40/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ భారత్ బౌలర్లను ధీటుగానే ఎదుర్కొంది.

అశ్విన్ అద్భుతమైన క్యాచ్
ఇదిలా ఉంటే రెండో రోజు ఆటలో అశ్విన్ ఓ అద్భుతమైన క్యాచ్‌ని అందుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన 77 ఓవర్ నాలుగో బంతికి ఆసీస్ ఆటగాడు హ్యాండ్ స్కాంబ్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ తన పైనుంచి వెళుతున్న బంతిని డైవ్ కొట్టి క్యాచ్‌గా అందుకున్నాడు.

సమయస్ఫూర్తితో వ్యవహరించిన అశ్విన్
అయితే ఆ బంతిని పట్టుకున్న తర్వాత చేతుల్లోంచి జారిపోయింది. ఈ సమయంలో అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించిన అశ్విన్ ఆ బంతిని చాకచక్యంగా వ్యవహరించి మళ్లీ తిరిగి క్యాచ్‌గా అందుకున్నాడు. కాగా, టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
లంచ్ విరామానికి భారత్ 38/0
బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా లంచ్ విరామానికి వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 87 పరుగుల ఆధిక్యం అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు లోకేష్ రాహుల్, అభినవ్ ముకుంద్‌లు నిలకడగా ఆడటంతో మూడో రోజు లంచ్ విరామ సమయానికి వికెట్ కోల్పోకుండా 38 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications