For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ రికార్డు: 'లెజెండ్' కోహ్లీ, 'యూనివర్స్ బాస్' గేల్ ఫోన్ సంభాషణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేర్కొన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేర్కొన్నాడు. రాజ్‌కోట్‌‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు

ఐపీఎల్ పాయింట్ల పట్టిక

ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ ‌మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ టీ20 క్రికెట్‌లో పదివేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీసి మూడు పరుగులు సాధించడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

దీంతో టీ20 క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లతో 77 పరుగులు చేసిన క్రిస్ గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు కెప్టెన్ కోహ్లీ కూడా 50 బంతుల్లో 64 పరుగులు చేశాడు.

Must-see Video: 'Legend' Virat Kohli interviews 'Universe Boss' Chris Gayle in IPL 2017


వీరిద్దరి జోడీ తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్‌కు అదృష్టం కలిసి రాగా, గుజరాత్ ఫీల్డర్ మెకల్లమ్‌ను దురదృష్టం వెంటాడింది. గుజరాత్ స్సిన్నర్ జడేజా వేసిన ఇన్నింగ్స్ 8 ఓవర్లో దూకుడుగా ఆడిన గేల్ చివరి బంతిని గాల్లోకి లేపాడు.

దీనిని మెకల్లమ్ బౌండరీ వద్ద అద్బుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. కానీ అతని పెట్టుకున్న ఫ్లాపీ హ్యాట్ గేల్‌ను రక్షించింది. థర్డ్ అంపైర్ రివ్యూలో క్యాప్ బౌండరీకి తగలడంతో గేల్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇక అర్ధసెంచరీ పూర్తి అయిన తర్వాత కోహ్లీ జోరును మరింత పెంచే క్రమంలో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

చివర్లో ట్రావిస్ హెడ్ (30 నాటౌట్: 16 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సు), కేదార్ జాదవ్ (16 బంతుల్లో 38 నాటౌట్: 5 ఫోర్లు, 2 సిక్సుల)తో రాణించడంతో బెంగళూరు 213 పరుగులు చేసింది. తొలి బ్యాటింగ్ అనంతరం విరాట్ కోహ్లీ, వరల్డ్ రికార్డు సృష్టించిన క్రిస్ గేల్‌ను మైక్రో ఫోన్ ద్వారా ఇంటర్యూ చేశాడు.

బెంగళూరు సూపర్ స్టార్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇలా:

విరాట్ కోహ్లీ: నాతో ఓపెనింగ్ చేయడం నీకు ఎలా అనిపిస్తోంది? (ఇద్దరు ప్లేయర్లు నవ్వారు)

క్రిస్ గేల్: నీతో కలిసి ఓపెనింగ్‌కు దిగడం అద్భుతమైన ఫీలింగ్. ఎంతో సంతోషంగా ఉంది. నువ్వ ఒక లెజెండ్. మరిన్ని పరుగులు చేయాలి. అవతలి ఎండ్‌లో నువ్వు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నిన్ను చూడటం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇప్పటివరకు నీ క్రికెట్ కెరీర్‌లో అద్భుతంగా రాణించావు. సీరియస్లీ రాబోయే రోజుల్లో మరిన్న పరుగులు చేయాలని కోరుకుంటున్నా.

విరాట్ కోహ్లీ: థ్యాంక్ యూ. నీకు తెలుసో లేదో. ఈరోజు (ఏప్రిల్ 18) మనమిద్దరం పదో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాం. ఇది ఒక రికార్డు. అంతేకాదు ఈరోజు క్రిస్ గేల్ టీ20ల్లో పదివేల పరుగుల రికార్డుని అందుకున్నాడు. 40.62 యావరేజితో స్ట్రయిర్ రేట్ 149.51. నీకు అభినందనలు. నీతో ఓపెనింగ్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.

విరాట్ కోహ్లీ: పదివేల పరుగులు మైలురాయిని చేరుకునే క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా యూనివర్సల్ బాస్ అంటూ పిలువబడ్డావు. (మళ్లీ ఇద్దరూ నవ్వారు)

పూర్తి ఇంటర్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్రిస్ గేల్: నిజంగా ఇదొక గొప్ప అనుభూతి. నా జీవితంలో ఇదొక స్పెషల్ మూమెంట్. మనమిద్దరం ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలను నెలకొల్పాం. ఆర్సీబీ వల్లే ఇదంతా సాధ్యమైంది. ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మీరంతా నాకు ఎంతో ప్రత్యేకం. అద్భుతమైన యువ ఆటగాళ్లతో కూడిన ఆర్సీబీలో ఉండటం సంతోషంగా ఉంది.

విరాట్ కోహ్లీ: అవును. క్రిస్ గేల్ అంటే ఎంతో ఇష్టం. అతడితో కలిసి ఓపెనింగ్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+