Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ కొత్త టోల్ ఫ్రీ నెంబర్ తెలుసా?: కోహ్లీ సేనపై విమర్శలు

హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎన్నో రికార్డులను సృష్టించింది. 2013 ఐపీఎల్‌లో అత్యధికలో పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు అవతరించింది. ఆ సీజన్‌ పూణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 20 ఓవర్లలో 263 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది.

ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 49 పరుగులకే ఆలౌటైంది. దీంతో పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకు ఆలౌటైంది.

Must read: Hilarious tweets on RCB’s lowest total in IPL history

దీంతో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోవడం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ పదో సీజన్‌లో బెంగళూరు చెత్త ప్రదర్శనపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.

ముఖ్యంగా ట్విట్ట‌ర్‌లో ఫ‌న్నీ కామెంట్లు పోస్ట్ చేస్తూ కోహ్లీ సేనపై విరుచుకపడ్డారు. ఒక్క బ్యాట్స్‌మ‌న్ కూడా రెండంకెల స్కోరు చేయ‌లేదు. దీన్ని ఉద్దేశించే ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ బెంగళూరు కొత్త టోల్‌ నంబర్‌(70189820250)ను అనౌన్స్‌ చేసిందని ట్వీట్ చేశాడు.

మరికొందరు బెంగళూరూ మొత్తం స్కోరు(49)ను అంతకుముందు రోజు మ్యాచ్‌లో ధోని టోటల్‌ స్కోర్‌(61)తో పోల్చి విమర్శలు చేశారు. ఇంకొందరు మాత్రం కోహ్లీ తన టీం సభ్యులకు 10 ఓవర్లలో మ్యాచ్‌ అయిపోవాలని చెప్పగా.. వారు పాటించారని, అంతుకే ఫలితం ఇలా ఉందని అంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+