Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mushfiqur Rahim:‘హ్యాండ్లింగ్ ది బాల్’తో ముష్ఫికర్ ఔట్.. బంగ్లాను వెంటాడుతున్న కర్మ

'కర్మ ప్రతిఫలం వెంటాడుతుంది' ఈ మాట మనం వింటుంటాం. అయితే క్రికెట్ ప్రపంచానికి ఈ రోజు అది రుజువైంది. సరిగ్గా నెల రోజుల క్రితం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్ 'టైమ్డ్ ఔట్' తో ఔటైన విషయం తెలిసిందే. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెల్మెట్ స్ట్రిప్ సరిగా లేదని, దాని కోసమే ఆలస్యమైందని కెప్టెన్ షకిబ్ అల్ హసన్ కు మాథ్యూస్ ఎంత నచ్చచెప్పినా బంగ్లాదేశ్ ఔట్ ను వెనక్కి తీసుకోలేదు.

అయితే ఆ సంఘటన జరిగిన సరిగ్గా నెల రోజులకు ఇవాళ బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. 'అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్' నిబంధనలోని 'హ్యాండ్లింగ్ ది బాల్' రూల్ తో అతడిని అంపైర్లు ఔట్ గా ప్రకటించారు. ఈ రీతిలో ఔటైన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్‌గా ముష్ఫికర్ నిలిచాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇది జరిగింది. అసలేం జరిగిందంటే..

Mushfiqur Rahim out with handling the ball rule. Karma haunting Bangladesh

కివీస్ పేసర్ జేమిసన్ వేసిన బంతిని ముష్పికర్ డిఫెండ్ చేశాడు. అయితే బాల్ వికెట్ల మీదకు వస్తుందని భావించిన ముష్ఫికర్ చేతితో అడ్డుకున్నాడు. వాస్తవానికి అది వికెట్లకు దూరంగానే వెళ్లింది. అయితే నిబంధనల ప్రకారం చేతితో బంతిని అడ్డుకోవడానికి వీళ్లేదు. కానీ, ముష్ఫికర్ అలా చేయడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అపీల్ చేశారు. థర్డ్ అంపైర్ 'హ్యాండ్లింగ్ ది బాల్'రూల్ తో ముష్ఫికర్ ను ఔట్ గా ప్రకటించాడు. అసలు 'హ్యాండ్లింగ్ ది బాల్'రూల్ అంటే ఏంటి?

2017లో 'హ్యాండ్లింగ్ ది బాల్'రూల్ ను 'అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్' నిబంధనలోకి చేర్చారు. దాని ప్రకారం బౌలర్ వేసిన బంతిని చేతితో ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ఔట్ గా పరిగణిస్తారు. అది బంతిని ఎదుర్కొనే సమయంలోనైనా, ఆడిన తర్వాత బాల్ వికెట్ల వైపు వెళ్తున్న సందర్భంలోనైనా చేతితో ఆపడానికి ప్రయత్నిస్తే ఔట్ గా పరిగణిస్తారురు. ఇదే నిబంధనతో ముష్ఫికర్ ఔటయ్యాడు.

ఇక ఈ రీతిలో ఔటైన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్ ముష్ఫికర్ నిలిచాడు. అలాగే మెన్స్ టెస్టు ఫార్మాట్ లో ఔటైన రెండో ఆటగాడు అతడే. కాగా, ఈ మ్యాచ్ లో ముష్ఫికర్ 83 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేసి వెనుదిరిగాడు.

Story first published: Wednesday, December 6, 2023, 15:08 [IST]
Other articles published on Dec 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+