
12/3తో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్
జట్టు స్కోరు 12/3తో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్, మరో ఆటగాడు మహ్మద్ మిథున్‌తో కలిసి 144 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించిన సంగతి తెలిసిందే. అయితే, దూకుడుగా ఆడే క్రమంలో 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. సూపర్-4 మ్యాచ్‌లో పాక్‌పై బంగ్లా 37 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం ముష్ఫికర్ రహీమ్ ఇలా
మ్యాచ్ అనంతరం ముష్ఫికర్ రహీమ్ మాట్లాడుతూ "యుద్ధ భూమిలో నిల్చున్నప్పుడు వెనుదిరిగి చూడొద్దు. అవతలి వారిని చంపాలి లేదా చావనైనా చావాలని మొర్తజా అన్నాడు. ఆ మాటలు నాలో, జట్టులో స్ఫూర్తి నింపాయి. మనకున్న శక్తితోనే మనం 100 శాతం పోరాడాలి. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా 100 శాతం కష్టడాలనుకున్నాం" అని చెప్పుకొచ్చాడు.

ఎప్పటికీ మనం పోరాడుతూనే ఉండాలి
"ఎవ్వరూ లేకుండా ఆడాల్సిన సమయం రావొచ్చు. సీనియర్లం అయిన మొర్తజా, షకిబ్, తమీమ్, మహ్మదుల్లా, నేను ఉండని కాలం రావొచ్చు. అయినప్పటికీ మనం పోరాడుతూనే ఉండాలి. ఈ చర్చే జట్టులో ప్రేరణ నింపింది. నిజం చెప్పాలంటే గెలిచిన తర్వాత బాధపడటం మానేశా. ముందు జట్టు, తర్వాతే నేను అనుకుంటా" అని ముష్ఫికర్ తెలిపాడు.

గెలిచిన తర్వాత చాలా సంతోషం వేసింది
"నేను సెంచరీ చేసి, బంగ్లాదేశ్ 260 పరుగులు చేసి ఓడిపోతే సంతోషంగా ఉండలేను కదా. ఇవి నా హృదయంలోంచి వస్తున్న మాటలు. నాతో పాటు మహ్మద్ మిథున్ అద్భుతంగా ఆడాడు. 48 ఓవర్ల వరకు క్రీజులో ఉండాలని భావించా. పాక్ బౌలింగ్ కట్టుదిట్టంగా ఉంది. గెలిచిన తర్వాత చాలా సంతోషం వేసింది" అని ముష్ఫికర్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












