న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముష్ఫికర్‌ డబుల్‌ సెంచరీ.. బంగ్లా తరఫున అరుదైన రికార్డులు!!

Mushfiqur Rahim hit his third Test double century vs Zimbabwe in Dhaka Test

ఢాకా: బంగ్లాదేశ్‌ సీనియర్ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అజేయ డబుల్‌ సెంచరీ చేసాడు. జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్‌ మరోసారి డబుల్‌ సెంచరీ ( 203 నాటౌట్‌) నమోదు చేశాడు. మూడో రోజు ఆటలో రహీమ్‌ డబుల్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. దాంతో తన టెస్టు కెరీర్‌లో మూడో డబుల్‌ సెంచరీ సాధించి ఆ దేశం తరఫున అత్యధిక సార్లు డబుల్‌ సెంచరీలు సాధించిన ఘనతను సవరించుకున్నాడు.

T20 World Cup: మళ్లీ తిప్పేసిన పూనమ్ యాదవ్.. బంగ్లాపై భారత్ ఘన విజయం!!T20 World Cup: మళ్లీ తిప్పేసిన పూనమ్ యాదవ్.. బంగ్లాపై భారత్ ఘన విజయం!!

 ముచ్చటగా మూడోసారి:

ముచ్చటగా మూడోసారి:

ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక డబుల్‌ సెంచరీ చేసిన వారిలో ముష్ఫికరే రహీమే ముందుండగా మరోసారి ఆ మార్కును సాధించి తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు. బంగ్లాదేశ్‌ తరఫున టెస్టుల్లో తమీమ్‌ ఇక్బాల్‌, షకీబుల్‌ హసన్‌లు మాత్రమే తలోసారి డబుల్‌ సెంచరీలు చేసారు. ముష్ఫికర్‌ మాత్రం మూడుసార్లు ఆ ఫీట్ అందుకున్నాడు.

అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు కూడా:

అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు కూడా:

బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు కూడా ముష్పికర్‌ రహీమ్‌ పేరిటే ఉంది. 2018లో జింబాబ్వేపై ముష్ఫికర్‌ అజేయంగా 219 పరుగులు చేసాడు. ఇదే బంగ్లా తరఫున ఇప్పటికే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. ఆ తర్వాత షకిబుల్‌ ఉన్నాడు. 2017లో షకిబుల్‌ 217 పరుగుల్ని న్యూజిలాండ్‌పై సాధించాడు.

మరోసారి వారిదే అత్యధికం:

మరోసారి వారిదే అత్యధికం:

టెస్టుల్లో నాలుగో వికెట్‌కు ముష్పికర్‌-మోమినుల్‌లు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో నాలుగో వికెట్‌కు రెండోసారి అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని ఆందించిన జోడిగా నిలిచింది. 2018లో జింబాబ్వేపైనే ముష్పికర్‌-మోమినుల్‌లు 266 పరుగుల భాగస్వామ్యాన్ని నాలుగో వికెట్‌కు అందించారు. ఇప్పుడు మరొసారి రెండొందలకు పైగా పరుగుల్ని అదే జట్టుపై సాధించారు.

మోమినుల్‌ తొలి శతకం:

మోమినుల్‌ తొలి శతకం:

ఓవర్‌నైట్‌ స్కోరు 240/3తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా 560/6 భారీ స్కోరుతో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. మోమినుల్‌ హక్‌ (132) కెప్టెన్‌గా తొలి శతకం బాదాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులే చేయడంతో.. బంగ్లాకు 295 రన్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే మూడోరోజు ఆట ఆఖరికి 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Story first published: Tuesday, February 25, 2020, 10:52 [IST]
Other articles published on Feb 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X