ఇండోర్‌లో ముష్పికర్ రహీమ్ ఒంటరి పోరాటం: భారత్‌పై అరుదైన రికార్డు

హైదరాబాద్: ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనతను సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు సాధించిన బంగ్లాదేశ్ క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో ముష్ఫికర్ క్రీజులోకి వచ్చాడు.
తన అనుభవంతో భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకుపోతున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న నిలకడగా ఆడుతూ ముప్పికర్ హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో ముప్పికర్‌కు ఇది 20వ హాఫ్ సెంచరీ కావడంవిశేషం. దీంతో టెస్టుల్లో భారత్‌పై బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అష్రాఫుల్ రికార్డుని బద్దలు కొట్టిన ముష్ఫికర్
ఈ క్రమంలో మహ్మద్ అష్రాఫుల్ పేరిట ఉన్న రికార్డును ముష్పికర్ బద్దలు కొట్టాడు. అష్రాఫుల్ భారత్‌పై 386 టెస్టు పరుగులు చేయగా దానిని ఇప్పుడు ముష్పికర్ అధిగమించాడు. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే ముష్ఫికర్ మూడో స్థానంలో ఉన్నాడు.

అగ్రస్థానంలో సచిన్
సచిన్ టెండూల్కర్(820) అగ్రస్థానంలో ఈ జాబితాలో నిలవగా రాహుల్ ద్రవిడ్(560) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, టెస్టుల్లో భారత్‌పై ముష్ఫికర్ యావరేజి 55కిపైగా ఉండటం విశేషం. భారత్‌తో ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడిన ముష్పికర్ మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు.

63 ఓవర్లకు గాను బంగ్లా స్కోరు ఇదే
ప్రస్తుతం 63 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్(59), తైజుల్ ఇస్లాం(6) పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ ఇంకా 140 పరుగుల వెనుకంజలో ఉంది. మరోవైపు టీమిండియా విజయం సాధించాలంటే మరో మూడు వికెట్లు అవసరం.

షమీకి మూడు వికెట్లు
భారత బౌలర్లలో షమీకి మూడు వికెట్లు దక్కగా... ఉమేశ్ యాదవ్‌కి రెండు... రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మలకు తలో వికెట్ లభించింది. ఇండోర్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండో రోజు 493/6 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగుల ఆధిక్యం లభించింది. మయాంక్ అగర్వాల్ (243), రహానే (86), రవీంద్ర జడేజా (60 నాటౌట్) రాణించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications