Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ముస‌ల్మాన్' మ‌హ‌మ్మ‌ద్‌ ష‌మీ వ‌ల్లే టీమిండియాకు ఘ‌న విజ‌యాలు: ర‌జాక్‌!

musalman Mohammed Shami for giving his best, sasy Abdul Razzak

క‌రాచి: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు ఎదుర్కొన్న ఒకే ఒక్క ప‌రాజ‌యం పాకిస్తాన్‌లో ప్ర‌కంప‌న‌ల‌ను పుట్టిస్తోంది. టీమిండియా ప‌రాజయాన్ని జీర్ణించుకోలేక‌పోతోంది పాకిస్తాన్. కోహ్లీసేన‌పై నిప్పులు చెరుగుతున్నారు ఆ దేశ క్రికెట్ అభిమానులు. టీమిండియా ఓట‌మి పాలు కావ‌డంతో శ‌తృదేశం పాకిస్తాన్ పండ‌గ చేసుకోవాలే గానీ.. ఇలా విమ‌ర్శ‌లు చేయ‌డానికి గ‌ల కార‌ణాలు అంద‌రికీ తెలిసిందే. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో భార‌త్‌.. ఇంగ్లండ్ చేతిలో ఓట‌మి చ‌వి చూసిన ప్ర‌భావం.. పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుపై తీవ్రంగా ప‌డింది. ఆ దేశం సెమీ ఫైన‌ల్‌కు వెళ్లడానికి గ‌ల అవ‌కాశాల‌కు గండి కొట్టింది.

ముస‌ల్మాన్ కావ‌డం గ‌ర్వ‌కార‌ణం: రజాక్‌

ముస‌ల్మాన్ కావ‌డం గ‌ర్వ‌కార‌ణం: రజాక్‌

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు వ‌రుస‌గా విజ‌యాల‌ను సాధించ‌డానికి ప్ర‌ధాన కార‌కుడు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ అని అబ్దుల్ ర‌జాక్ అన్నారు. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ముసల్మాన్ కావ‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చెప్పారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓట‌మి చవి చూడ‌టంపై స్థానిక న్యూస్ ఛాన‌ల్ నిర్వ‌హించిన ఓ డిస్క‌ష‌న్ సంద‌ర్భంగా అబ్దుల్ ర‌జాక్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ ఓట‌మి పాలు కావ‌డం, పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుకు గ‌ల అవ‌కాశాలను దెబ్బ‌తీయ‌డంపై ఓ న్యూస్ ఛాన‌ల్ డిస్క‌ష‌న్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా- ఆ ఛాన‌ల్ యాంక‌ర్లు టెలిఫోన్ ద్వారా అబ్దుల్ ర‌జాక్ అభిప్రాయాల‌ను సేక‌రించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇత‌ర బౌల‌ర్లు విఫ‌ల‌మైనా..ష‌మీ రాణిస్తున్నాడు..

ఇత‌ర బౌల‌ర్లు విఫ‌ల‌మైనా..ష‌మీ రాణిస్తున్నాడు..

టీమిండియాలో ఇత‌ర ప్ర‌ధాన బౌల‌ర్లంద‌రూ విఫ‌ల‌మైన చోట మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ అద్భుతంగా రాణిస్తున్నాడ‌ని అబ్దుల్ ర‌జాక్ చెప్పారు. అత‌ను ముస‌ల్మాన్ కావ‌డం మంచి విష‌య‌మ‌ని అన్నారు. పేర్లు ప్ర‌స్తావించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. య‌జువేంద్ర చాహ‌ల్‌, కుల్‌దీప్ సింగ్‌, జ‌స్‌ప్రీత్ బూమ్రాలు బౌల‌ర్లుగా విఫ‌లం అయ్యార‌ని, వారి స్థానంలో ష‌మీ ఒక్క‌డే చ‌క్క‌గా బౌలింగ్ చేస్తున్నాడ‌ని అన్నాడు. లైన్ అండ్ లెంగ్త్‌కు క‌ట్టుబ‌డి, బౌలింగ్ ప్రాథ‌మిక సూత్రాల‌కు అనుగుణంగా బంతిని సంధిస్తున్నాడ‌ని చెప్పాడు. ఫ‌లితంగా- వికెట్ల‌ను ప‌డ‌గొట్ట‌గలుగుతున్నాడ‌ని ర‌జాక్ అన్నాడు. ఒత్తిడిలో ఉన్న ఇంగ్లండ్‌పై మ‌రింత ఒత్తిడిని తీసుకుని రావ‌డంలో భార‌త బౌల‌ర్లు విఫ‌లం అయ్యార‌ని, ష‌మీ ఒక్క‌డే గొప్ప‌గా రాణించాడని అన్నాడు. ర‌జాక్ గొంతుతో కూడుకుని ఉన్న‌ట్టుగా భావిస్తోన్న ఓ వీడియో క్లిప్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. క్రికెట్‌లో మ‌తాన్ని లాగడం ప‌ట్ల భార‌తీయ అభిమానులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

 ష‌మీ.. మూడు మ్యాచుల్లో 13 వికెట్లు..

ష‌మీ.. మూడు మ్యాచుల్లో 13 వికెట్లు..

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ అద్భుతంగా రాణిస్తోన్న విష‌యం తెలిసిందే. భువ‌నేశ్వ‌ర్ కుమార్ గాయ‌ప‌డ‌టం వ‌ల్ల తుది జ‌ట్టులో చోటు సంపాదించాడు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో అత‌ను ఆడిన తొలి మ్యాచ్ ఆఫ్ఘ‌నిస్తాన్‌పై. ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. మొత్తంగా నాలుగు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. 1983 త‌రువాత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో భార‌త బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. అత‌ని బౌలింగ్ ఫామ్ ఆ ఒక్క మ్యాచ్‌లోనే ఆగ‌లేదు. వెస్టిండీస్‌పైనా కొన‌సాగింది. వెస్టిండీస్‌పై ష‌మీ నాలుగు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. అనంత‌రం- కీల‌క‌మైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ అత‌ను రాణించాడు. ఈ సారి ఏకంగా అయిదు వికెట్లు తీసుకున్నాడు. భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న‌ప్ప‌టికీ.. వికెట్ల‌ను తీసుకోవడం ఊర‌ట క‌లిగించే విషయం. మొత్తంగా మూడు మ్యాచుల్లో 13 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు.

Story first published: Tuesday, July 2, 2019, 13:15 [IST]
Other articles published on Jul 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+