టీమిండియాలో స్థానం కావాలంటే ద్రవిడ్ స్టాంప్ పడాల్సిందే..!!

హైదరాబాద్: రాహుల్ ద్రవిడ్ ఆమోదం లేనిదే టీమిండియాలోకి ప్రవేశం లేదంటూ పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై అధికారంగా కాకపోయినా జట్టు కూర్పును చూస్తే అదే విషయం తేటతెల్లమవుతోంది. ఎలాగంటే, సెలక్షన్ కమిటీ సభ్యులు కూడా ద్రవిడ్ మార్క్ ఉండాల్సిందే అంటున్నారట. భారత్ ఏ జట్టుకు ఆడి సత్తా చాటితేనే జాతీయ జట్టులో చోటు దొరుకుతుందట. ఈ పాలసీని అమలు చేసేందుకు ద్రవిడ్ పక్కా ప్లాన్ సిద్ధం చేశాడని సెలక్షన్ కమిటీ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు.
అఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్‌కు కరుణ్‌నాయర్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న రహస్యమిదేనంటూ బాహాటంగానే వెల్లడించారు. ద్రవిడ్‌ను సంప్రదించే అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్, ఇంగ్లాండ్‌కు వెళ్లే భారత జట్టును ప్రకటించామని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు. దీంతో జట్టు ఎంపికలో కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీతో పాటు ద్రవిడ్ ఆమోద ముద్ర పడాల్సిందేనంటూ స్పష్టమవుతోంది.

ద వాల్‌గా పేరు తెచ్చుకున్న ద్రవిడ్
భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి, ద వాల్‌గా పేరు తెచ్చుకున్న ద్రవిడ్.. ఆటకు వీడ్కోలు చెప్పిన తర్వాత భారత్ ఏ, అండర్-19 కోచ్‌గా తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. క్రికెట్ పట్ల అతనికున్న ప్రేమ, అంకితభావాన్ని అందరూ ప్రశంసిస్తుంటారు. అందుకే బీసీసీఐ అతడిపై అపార నమ్మకం ఉంచింది. భారత జట్టుకు కోచ్‌గా రమ్మంటే, వచ్చే తరాన్ని తయారు చేయడమే నాకిష్టం అంటూ కుర్రాళ్లను సానపట్టే పనిలో పడ్డాడు.

జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే ఒకసారి:
అందులో భాగంగానే అండర్-19 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాడు. అంతేకాదు ఆ కుర్రాళ్లు ఇప్పుడు ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్నారు. పృథ్వీషా, శుభ్‌మన్ గిల్, శివం మావి ఇప్పటికే సత్తా చాటారు. ఇక రిషబ్ పంత్, శ్రెయాస్ అయ్యర్, సంజూ శాంసన్ కూడా ద్రవిడ్ శిష్యరికంలో రాటుదేలిన వారే. దీంతో జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే ఒకసారి ద్రవిడ్ గురుకులంలో పాఠాలు అభ్యసించాల్సిందే అనే నమ్మకాన్ని సెలక్టర్లలోనూ కలిగించాడు.

కేఎల్ రాహుల్ మొదట గుర్తు చేసుకుంది ద్రవిడ్ పేరునే:
భారత జట్టులోనూ చాలా మంది ద్రవిడ్ నుంచి నేర్చుకుని, అతడిని చూస్తూ ఎదిగిన వారే. కేఎల్ రాహుల్ టీమిండియాలో చోటు దక్కించుకున్న తర్వాత మొదట గుర్తు చేసుకుంది ద్రవిడ్ పేరునే. ఇప్పుడు రాహుల్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా మారాడు. ఇక టెస్టు స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రహానే ద్రవిడ్ నుంచి ఎంతో నేర్చుకున్నామని అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

కుర్రాళ్లందరికీ ఆడే అవకాశం:
ఐపీఎల్‌లో దేశవాళీ కుర్రాళ్లందరికీ ఆడే అవకాశం రాకపోవచ్చు. అది ఆయా ఫ్రాంచైజీలపై ఆధారపడి ఉంటుంది. అందుకే సెలక్టర్లు ఆ మాయలో పడొద్దు. ఐపీఎల్‌లో ఆడితేనే భారత్ ఏలో చోటు దక్కుతుందన్న భ్రమలో ఉండి కొందరు యువ క్రికెటర్లు రంజీ ట్రోఫీని విస్మరిస్తున్నారు అని బీసీసీఐ ప్రతినిధి వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications