హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ మరోసారి తండ్రయ్యాడు. ఇప్పటికే ఒక కుమారుడు, కుమార్తె ఉన్న మురళీ విజయ్ దంపతులు మూడో బిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం మురళీ విజయ్ భార్య నిఖిత పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ మేరకు మురళీ విజయ్ పెద్ద కుమారుడు అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకున్న ఫోటోను మురళీ విజయ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 'ఇద్దరు రాక్ స్టార్లలో ఒకరు మరొకర్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు' అనే క్యాప్షన్‌తో మురళీ విజయ్ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే శ్రీలంకతో ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా గాయానికి గురైన మురళీ విజయ్ అప్పటినుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆరంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనతో మురళీ విజయ్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది.