సెంచరీతో మళ్లీ ఫామ్ అందుకున్న మురళీ విజయ్

హైదరాబాద్: భారీ అంచనాలతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది టీమిండియా. తొలి ఫార్మాట్ అయిన టీ 20లో విజయాన్ని సొంతం చేసుకుంది. మిగిలిన రెండు సిరీస్‌లలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని యోచించింది. కానీ, అనూహ్య రీతిలో వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. మిగిలిన టెస్టు సిరీస్‌లో మెరుగ్గా రాణించాలని ప్రయత్నించి జట్టులో అనేక మార్పులు చేసుకుంటూ సిరీస్‌ను పూర్తి చేసుకున్నా నిరాశే మిగిలింది.

కౌంటీ అనుభవం పనికొస్తుందనుకుంటే:
ఈ జట్టు మార్పులు చేసే నేపథ్యంలోనే కౌంటీ క్రికెట్‌లో ఆడుతోన్న మురళీ విజయ్ జట్టులోకి తీసుకుంటే బలం చేకూరుతుందని తలచాడు కెప్టెన్. కానీ, అతను ఆడిన తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. టెస్టు సిరీస్ పూర్తి అయిన తర్వాత మళ్లీ కౌంటీల్లో ఆడతున్నాడు భారత ఓపెనర్ మురళీ విజయ్. ఎసెక్స్ తరఫున కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన ఈ ఓపెనర్ మళ్లీ ఫామ్ అందుకుని తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో ఆ జట్టుకి ఘన విజయాన్ని అందించాడు.
అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి
ఈ టోర్నీ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన రెండో క్రికెటర్‌గా మురళీ విజయ్ తాజాగా నిలిచాడు. 2009లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హసీమ్ ఆమ్లా తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో ఈ రికార్డుని నెలకొల్పాడు.

ఎసెక్స్ జట్టు 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని
నాటింగ్‌షైర్‌తో గురువారం ముగిసిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేసిన మురళీ విజయ్ రెండో ఇన్నింగ్స్‌లో 181 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో.. 282 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్ జట్టు 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.

తొలి రెండు టెస్టుల అనంతరం..:
ఇంగ్లాండ్‌పై తొలి రెండు టెస్టుల్లో మురళీ విజయ్ విఫలమవడంతో.. మూడో టెస్టులో అతనిపై వేటు పడింది. ఆ తర్వాత జరిగిన 4, 5వ టెస్టుల కోసం అతడ్ని సెలక్టర్లు కనీసం జట్టులోకి కూడా ఎంపిక చేయలేదు. మురళీ విజయ్ స్థానంలో యువ ఓపెనర్ పృథ్వీ షాకి జట్టులో అవకాశం కల్పించారు. దీంతో.. వారం రోజుల విరామం అనంతరం ఇటీవలే ఎసెక్స్‌కి ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications