Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంక పర్యటనకు ముందు మురళీ విజయ్‌కి ఫిట్‌నెస్ 'టెస్ట్'

హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ మురళీ విజయ్ తన ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు దేశవాళీ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ జులై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టుల సిరిస్‌ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

దీంతో తన ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు గాను జులై 13 (గురువారం) నుంచి ఆరంభమయ్యే టీఎన్‌సీఏ ఫస్ట్ డివిజన్ లీగ్‌లో పాల్గొనున్నాడు. ఈ లీగ్ చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలీజీలో జరుగుతుంది. ఈ లీగ్ మ్యాచ్‌లో మురళీ విజయ్ రోవర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

మ్యాచ్ సందర్భంగా మురళీ విజయ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ "అవును. నేను మ్యాచ్ ఆడుతున్నాను. బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నాను. క్రీజులో సాధ్యమైనంత ఎక్కువ సేపు ఉండి భారీ స్కోరు సాధించాలి" అని మురళీ విజయ్ అన్నాడు.

Murali Vijay to play league match to test fitness ahead of Sri Lanka tour

33 ఏళ్ల మురళీ విజయ్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరిస్ జరిగిన సమయంలో భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సర్జరీ జరగడంతో ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ పదో సీజన్‌కి కూడా దూరమయ్యాడు. గత నెలలో మెడికల్ అసిస్టెమెంట్ కోసం జాతీయ క్రికెట్ అకాడమీకి కూడా వెళ్లాడు.

అక్కడి నెట్స్‌లో తీవ్ర ప్రాక్టీస్ చేశాడు. అకాడమీలో ఫాస్ట్ బౌలింగ్‌ను సైతం సమర్ధవంతగా ఎదుర్కొన్నాడు. దీంతో సెలక్టర్లు అతడిని శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ఎంపిక చేశారు. అయినప్పటికీ తన ఫిట్‌నెస్‌ని పరీక్షించుకునేందుకు దేశవాళీ లీగ్‌లో ఆడుతున్నాడు.

లంక పర్యటనకు భారత జట్టు:
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), మురళీ విజయ్‌, కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర పుజారా, అజింక్య రహానె (వైఎస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ఆర్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌కుమార్‌, మహ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్‌, అభినవ్‌ ముకుంద్‌

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+