Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికా పర్యటన: మొదటి మ్యాచ్‌కు ధావన్ ఆడట్లేదట

Murali Vijay, KL Rahul to open in first Test vs South Africa

హైదరాబాద్: ఎమిరేట్స్ వాళ్లు కుటుంబాన్ని తనతో పాటు రానివ్వకుండా ఇబ్బంది పెట్టినా ధావన్ ఒంటరిగా దక్షిణాఫ్రికాకు చేరుకున్నాడు. అయినా కూడా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ దూరం అయ్యాడు. కాలి గాయంతోనే ధావన్‌ టీమిండియాతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్ధమయ్యాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం కోహ్లీ సేన ఇప్పటికే దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. జనవరి 5న ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ధావన్‌ కాలి గాయం నుంచి కోలుకోనేటట్లు లేడని తెలుస్తోంది. దీంతో కేప్‌టౌన్‌లో జరగబోయే టెస్టు నుంచి ధావన్‌ను దూరంగా ఉంచుతున్నట్లు భారత క్రికెట్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ సభ్యులు తెలిపారు. దీంతో ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌-మురళీ విజయ్‌ బరిలోకి దిగనున్నారు. తొలి టెస్టుకు ధావన్‌ దూరం కావడం పట్ల కెప్టెన్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

సెంటర్‌ వికెట్‌ ప్రాక్టీస్‌కు ఇప్పుడు ఒప్పుకున్నారు.
గతంలో ధోనీ నాయకత్వంలో టీమిండియా 2013-14 సీజన్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో సెంటర్‌ వికెట్‌పై ప్రాక్టీస్‌ చేస్తామని అడగ్గా అప్పుడు సీఎస్‌ఏ తిరస్కరించిన సంగతి తెలిసిందే. బోలాండ్‌ పార్కు సెంటర్‌లో భారత క్రికెట్‌ జట్టు సెంటర్‌ వికెట్‌పై ప్రాక్టీస్‌ చేసేందుకు క్రికెట్‌ దక్షిణాఫ్రికా(సీఎస్‌ఏ) అనుమతి ఇచ్చింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 30, 2017, 17:32 [IST]
Other articles published on Dec 30, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+