వీడియో : స్టేడియంలో మురళీ విజయ్‌ను ఘోరంగా ఎగతాళి చేసిన ఫ్యాన్స్.. దండం పెట్టినా వినని ఫ్యాన్స్.. ఏమైందంటే?

భారత క్రికెటర్ మురళీ విజయ్ ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో రూబీ ట్రిక్కీ వారియర్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ మ్యాచ్‌లో మురళీ విజయ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా అతనికి ఓ చేదు అనుభవం ఎదురైంది. బౌండరీ లైన్ వద్ద ఉన్న అతన్ని కొందరు అభిమానులు ఆటపట్టించారు. డీకే.. డీకే.. డీకే.. అంటూ దినేష్ కార్తీక్ పేరును ఫ్యాన్స్ హోరెత్తించారు. దీంతో ఫీల్డింగ్ చేస్తున్న మురళీ విజయ్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు.
ఇక భారత జట్టులో సంచలన పునరాగమనం చేసిన దినేష్ కార్తీక్.. మురళీ విజయ్ మధ్య పర్సనల్ విభేదాలు ఏ రేంజులో ఉన్నాయో అందరికీ తెలిసిందే. దినేష్ కార్తీక్ మొదటి భార్య నిఖిత వంజరతో మురళీ విజయ్ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో దినేష్ కార్తీక్‌కు నిఖితకు మధ్య విడాకులయ్యాయి. ఆ తరువాత డీకే భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు. ఇక నిఖితను విజయ్ పెళ్లి చేసుకున్నాడు.

ఇటీవల భారీగా పెరిగిన డీకే ఫ్యాన్ బేస్
ఇక ప్రస్తుతం టీమిండియాకు స్టార్ ఫినిషర్ అనే గుర్తింపు తెచ్చుకుంటున్న డీకే ఫ్యాన్ బేస్ ఇటీవల బాగా పెరిగింది. అతను క్రీజులోకి వస్తుంటే చాలు ఫ్యాన్స్ డీకే నామజపంతో హోరెత్తిస్తున్నారు. ఇదే క్రమంలో సంచలన ప్రదర్శనలు చేస్తున్న డీకే పర్సనల్ లైఫ్ విషయమై కూడా చాలా వార్తలొస్తున్నాయి. దినేష్ కార్తీక్ మొదటి భార్య నికితను, మురళీ విజయ్‌ను ట్రోల్స్ చేస్తూ అభిమానులు పోస్టులు కూడా కురిపించారు. తాజాగా మురళీ విజయ్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఫ్యాన్స్ ఎగతాళికి బుక్కయ్యాడు.
ఎగతాళి చేస్తుండడంతో వెనక్కి తిరిగి దండం పెట్టి
బౌండరీ లైన్ వద్ద పదే పదే డీకే పేరు జపించడంతో మురళీ విజయ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. తనపై ఫ్యాన్స్ అంతలా ఎగతాళి చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. వ్యక్తిగత విషయాలను ఇక్కడ ప్రస్తావించొద్దంటూ వేడుకున్నాడు. ఈ మేరకు బౌండరీ లైన్ వద్ద వెనక్కి ప్రేక్షకుల వైపు తిరిగి దండం పెట్టి మరీ అభ్యర్థించాడు. ఓ అభిమాని ఈ వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.

ఫస్ట్ వైఫ్ దారుణ మోసం..!
దినేశ్ కార్తీక్ అప్పట్లో టీమిండియా సెకండ్ వికెట్ కీపర్‌గా తమిళనాడు కెప్టెన్‌గా రాణిస్తున్న టైమ్‌లో అతని టీమ్‌మేట్ మురళీ విజయ్.. కార్తీక్ మొదటి భార్య నికితాతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఒకరోజు అతని మొదటి భార్య ఈ విషయాన్ని కార్తీక్‌కు చెబుతూ.. మురళీ విజయ్ కారణంగా గర్భం దాల్చానని విడాకులు ఇవ్వాలని డీకేను కోరింది. విడాకులు తీసుకున్నాక ఆమె మురళీతో డేటింగ్ పర్వం మొదలుపెట్టింది. ఆ టైమ్‌లో విజయ్.. సీఎస్‌కే, టీమిండియా ఓపెనర్‌గా కెరీర్ పీక్ పర్ఫార్మెన్స్‌తో రాణిస్తున్నాడు.

కొన్నాళ్ల పాటు తేరుకోని కార్తీక్..
తొలి భార్య చేసిన మోసానికి దినేశ్ కార్తీక్ కొన్నాళ్లపాటు మనిషి మనిషిలా లేడు. అతని ఆట దెబ్బతిన్నది. టీమిండియాలో చోటు కోల్పోయాడు. తమిళనాడు కెప్టెన్సీని కోల్పోయాడు. ఐపీఎల్‌లోనూ విఫలమయ్యాడు. మిగతా ఆటగాళ్ల హేళనలకు గురయ్యాడు. పూర్తిగా జీవితం మీద విరక్తి చెందాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న దినేశ్ కార్తీక్ ట్రైనర్.. అతనికి కాస్త స్వంతన వచనాలు చెప్పి ప్రేరణనిచ్చాడు. మళ్లీ జిమ్‌లో ఏదో చేయాలని అకుంఠిత సాధన చేసేవాడు.

చలించిపోయిన దీపిక పల్లికల్
అలా దినేశ్ కార్తీక్‌ను చూసి అదే జిమ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ అతనితో పరిచయం పెంచుకుంది. డీకే బాధ విని చలించిపోయింది. ట్రైనర్‌తో పాటు ఆమె కూడా దినేశ్ కార్తీక్‌కు అండగా నిలబడింది. క్రమేపీ అతను డొమెస్టిక్ మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. టీమిండియాకు మళ్లీ ఎంపికయ్యాడు. కేకేఆర్ కెప్టెన్సీ అందుకున్నాడు. పల్లికల్, డీకే మధ్య స్నేహం ప్రేమగా మారి వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఆమె రాకెట్ పట్టుకుంది.. అతను బ్యాట్ పట్టాడు
34ఏళ్ల వయసులో అతని కెరీర్ చివరి దశకు చేరిన టైంలో అప్పటికే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన దీపిక పల్లికల్ మళ్లీ స్క్వాష్ రాకెట్ అందుకోగా.. డీకే సైతం భార్య ప్రేరణతో బ్యాట్ పట్టాడు. ఇద్దరూ కలిసి ట్రైనింగ్ మొదలుపెట్టారు. ఇక ఆర్సీబీ డీకేను కొనుగోలు చేయడంతో ఐపీఎల్ 2022లో ఫినిషర్ రోల్‌లో డీకే సత్తా చాటాడు. ఫలితంగా టీమిండియాకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం టీ20జట్టులో అతను మండెటరీ ప్లేయర్‌గా మారుతున్నాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్లో అతను ఆడనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications