For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకే ఓవర్లో 26పరుగులు: తొలి టెస్టుకు సిద్ధమైన మురళీ విజయ్(వీడియో)

Murali Vijay blasts 26 runs in an over to reach century

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకి ముందు భారత్ ఓపెనర్ మురళీ విజయ్ జూలు విదిల్చాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్‌తో సిడ్నీ వేదికగా ఈరోజు ముగిసిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన మురళీ విజయ్ ((129), 132 బంతుల్లో 16 ఫోర్లు, 5సిక్సులు).. జట్టులో పునరాగమనానికి మార్గం సుగుమం చేసుకున్నాడు.

పృథ్వీ షా గాయంతో.. మురళీకి లైన్ క్లియర్

పృథ్వీ షా గాయంతో.. మురళీకి లైన్ క్లియర్

శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో.. తొలి టెస్టులో ఆడేందుకు మురళీ విజయ్‌కి లైన్ క్లియరైంది. కానీ.. అతని పేలవ ఫామ్‌ నేపథ్యంతో.. జట్టులో స్థానం కల్పిచడంపై టీమిండియా సందేహంలో ఉంది. అయితే.. శనివారం తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఫామ్‌కి తిరుగులేదని సత్తా చాటుకున్నాడు.

4, 4, 6, 2, 6, 4 బాది సెంచరీ పూర్తి

4, 4, 6, 2, 6, 4 బాది సెంచరీ పూర్తి

38వ ఓవర్‌ ముగిసేసరికి 74 పరుగులతో ఉన్న విజయ్‌.. స్పిన్నర్ జేక్ కార్డర్ కార్డర్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 4, 6, 2, 6, 4 బాది సెంచరీ పూర్తి చేయడం విశేషం. మరో ఓపెనర్‌ రాహుల్‌తో అతను తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించాడు. 44వ ఓవర్‌లో మురళీ విజయ్‌ ఔటైన తర్వాత మ్యాచ్‌ ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. భారత్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకి ఆలౌటైంది.

27 బంతుల్లో 50 పరుగులు

ఈ ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్ సెంచరీ సాధించాడు. టీ20 మాదిరి దూకుడుగా ఆడిన మురళీ విజయ్ తొలి హాఫ్‌ సెంచరీ సాధించడానికి 91 బంతులు తీసుకోగా... ఆ తర్వాత మరింతగా రెచ‍్చిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీని సెంచరీగా మలచడానికి కేవలం 27 బంతులు మాత్రమే తీసుకున్నాడు. మొత్తం 132 బంతులను ఎదుర్కొన్న విజయ్‌ 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు.

డ్రాగా ఎలా ముగిసిందంటే:

డ్రాగా ఎలా ముగిసిందంటే:

ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 2 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 356/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సీఏ ఎలెవన్‌.. 544 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇలా ఆస్ట్రేలియా ఎలెవన్‌తో టీమిండియా డ్రాగా ముగించికుంది.

Story first published: Sunday, December 2, 2018, 13:18 [IST]
Other articles published on Dec 2, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+