Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

14 ఏళ్ల తర్వాత: వాంఖడెలో మురళీ విజయ్ ఘనత

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని జరుగుతున్న నాలుగో టెస్టులో రికార్డుల మోత మోగుతుంది. ఘనమైన చరిత్ర ఉన్న వాంఖడె స్టేడియంలో ఇప్పటివరకు 38 టెస్టు సెంచరీలు నమోదయ్యాయి. 1975లో తొలిసారి ఈ స్టేడియం అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది.

ఆనాటి నుంచి ఇప్పటి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు వరకు వాంఖడె స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు 22 సెంచరీలు సాధించారు. అయితే ఓపెనర్లలో అత్యధికంగా ఇక్కడ సెంచరీలు చేసింది మాత్రం టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రమే.

వాంఖడె స్టేడియంలో సునీల్ గవాస్కర్ ఓపెనర్‌గా ఐదు సెంచరీలు సాధించాడు. ఇక్కడ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ 2002లో చివరిసారిగా వీరేంద్ర సెహ్వాగ్ టెస్టు సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఓపెనర్ మురళీ విజయ్ టెస్టు సెంచరీని సాధించాడు.

Murali Vijay answers critics with stylish eighth hundred

అంటే దాదాపు 14 ఏళ్ల తర్వాత వాంఖడె స్టేడియంలో ఓ భారత ఓపెనర్ టెస్టు సెంచరీ సాధించాడన్నమాట. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే గడచిన ఇరవై ఏళ్ల కాలంలో వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్‌లు మాత్రమే భారత ఓపెనర్లుగా సెంచరీలు చేసిన వారి జాబితాలో ఉన్నారు.

146/1 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 70 పరుగులు ఓవర్ నైట్ స్కోరుతో ఉన్న మురళీ విజయ్ శనివారం సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 231 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. విజయ్‌కి ఇది టెస్టుల్లో ఎనిమిదో సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో రెండోది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+