Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లంక ప్రీమియర్‌ లీగ్ వేలంలో పాల్గొనబోతున్న టీమిండియా మాజీ పేసర్!!

Munaf Patel, Chris Gayle, Shahid Afridi among overseas players for Lanka Premier League auction

ముంబై: లంక ప్రీమియర్‌ లీగ్ వేలంలో టీమిండియా మాజీ పేసర్‌ మునాఫ్‌ పటేల్‌ పాల్గొనబోతున్నాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు తొలిసారి నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్‌ వేలం అక్టోబర్‌ 1న జరగనుంది. ఈ వేలంలో పాల్గొనడానికి సుమారు 150 మంది విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం తెలుస్తోంది. అందులో భారత మాజీ పేసర్ మునాఫ్‌ పటేల్‌‌ ఉన్నాడు.

వేలంలో పాల్గొనబోతున్న మునాఫ్‌:

వేలంలో పాల్గొనబోతున్న మునాఫ్‌:

ఇతర దేశాల నుంచి పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది, ఇంగ్లాండ్‌ ఆటగాడు రవి బొపారా, బంగ్లాదేశ్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ బ్రావో, న్యూజీలాండ్ స్టార్‌ కొలిన్‌ మన్రో, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్, వెస్టిండీస్ సీనియర్ ఓపెనర్ క్రిస్ గేల్, విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ తదితరులు లంక ప్రీమియర్‌ లీగ్ వేలంలో పాల్గొననున్నారట.

 ప్రతీ జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు:

ప్రతీ జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు:

నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6 వరకు ఐదు ఫ్రాంఛైజీలతో ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించాలని శ్రీలంక దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతీ జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు, 13 మంది స్వదేశీయులతో మొత్తం 19 మంది చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. లీగ్ నిబంధనల ప్రకారం చూస్తే 30 మంది విదేశీయులు ఈ వేలంలో ఎంపికయ్యే అవకాశం ఉంది. మొదటగా ఈ టోర్నీని ఆగస్టులోనే నిర్వహించాలని చూసినా.. కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది.

బయో బబుల్ వాతావరణంలో:

బయో బబుల్ వాతావరణంలో:

ప్రస్తుతం అన్ని క్రీడలూ జరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం ముందడుగు వేసింది. లంక ప్రీమియర్‌ లీగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. బయో బబుల్ వాతావరణంలో టోర్నీని నిర్వహించనున్నారు. మరోవైపు ఈ టోర్నీ కోసం శ్రీలంకకు వచ్చే ఆటగాళ్లకు క్వారంటైన్‌ సమయాన్ని 14 రోజులకు బదులు 7 రోజులకు కుదించాలని ఆ క్రికెట్‌ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక శ్రీలంక ప్రభుత్వం మాత్రం క్వారంటైన్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంది. అక్కడ వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా గట్టి చర్యలు తీసుకుంటోంది.

2018లో క్రికెట్‌కు వీడ్కోలు:

2018లో క్రికెట్‌కు వీడ్కోలు:

2006లో టీమిండియాకు ఎంపికైన మునాఫ్‌ పటేల్..‌ 2018లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడికి విదేశీ లీగుల్లో ఆడే అవకాశం లభించింది. ఇదివరకు యూఏఈలో నిర్వహించిన టీ10 లీగ్‌లోనూ ఆడాడు. ఇక భారత్ తరఫున మొత్తం 13 టెస్టులు, 70 వన్డేలు ఆడిన మునాఫ్‌.. టీ20ల్లో మాత్రం కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడు.

Delhi Capitals: అశ్విన్‌ మరో యాంగిల్.. ఈసారి లెప్ట్ హ్యాండ్ బౌలింగ్!

Story first published: Saturday, September 12, 2020, 16:29 [IST]
Other articles published on Sep 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+