Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పప్పులో కాలేసిన నీతా అంబానీ!

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓ ఆటగాడిని నిలుపుకోకుండా పప్పులో కాలేసింది. ఇప్పుడు అదే ఆటగాడు మరొక జట్టు తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు టిమ్ డేవిడ్. టిమ్ డేవిడ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో టిమ్ డేవిడ్ చాలా పరుగులు చేశాడు.

ఆర్సీబీకి లాభం
ముంబై జట్టు గతంలో టిమి డేవిడ్ ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేయగా.. ఈ సారి ఆర్సీబీ జట్టు కేవలం రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ తరపున టిమ్ డేవిడ్ మూడు సీజన్లలో 658 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో నీతా అంబానీ, ఆకాష్ అంబానీల జట్టు ముంబై ఇండియన్స్ టిమ్ డేవిడ్ ను తిరిగి కొనుగోలు చేయలేదు. ఈ వేలం జెడ్డాలో జరిగిన విషయం తెలిసిందే. ముంబై జట్టు టిమ్ డేవిడ్ స్థానంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ను చేర్చుకుంది. ముంబై విల్ జాక్స్ ను రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది.

Mumbai s Big Mistake Tim David Shines for RCB After MI Drops Him

2022లో టిమ్ డేవిడ్ ను కొనుగోలు చేసిన ముంబై
గతంలో ఐపీఎల్ 2022 మెగా వేలంలో టిమ్ డేవిడ్ ను ముంబై రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. టిమ్ డేవిడ్ 2022 నుంచి 2024 వరకు ముంబై తరఫున మూడు సీజన్లు ఆడాడు. టిమ్ డేవిడ్ 170 కంటే ఎక్కవు స్ట్రెక్ రేట్ తో 658 పరుగులు చేశాడు. కానీ ఐపీఎల్ 2025 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టిమ్ డేవిడ్ ను కేవలం రూ.3కోట్లకు కొనుగోలు చేసింది. టిమ్ డేవిడ్ ఇప్పుడు ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. టిమ్ డేవిడ్ ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరఫున 142 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 194.52. ఈ లీగ్ లో టిమ్ డేవిడ్ తన తొలి అర్థ సెంచరీ కూడా సాధించాడు. ఆర్సీబీ తరఫున టిమ్ డేవిడ్ ఫోర్లు కొట్టిన దాని కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. టిమ్ డేవిడ్ 11 ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టాడు. గురవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్‌కు టిమ్ డేవిడ్ సిద్ధంగా ఉన్నాడు.

వేలంలో తప్పు చేసిన ముంబై
టిమ్ డేవిడ్‌ను ముంబై ఎందుకు కొనుగోలు చేయలేదనేది పెద్ద ప్రశ్నగా మారింది. అతను ముంబై తరపున బాగా రాణించాడు. చాలా మ్యాచ్ లను కూడా గెలిపించాడు. అయినప్పటికీ ముంబై అతడిని విడుదల చేసింది. అతడి స్థానంలో ముంబై విల్ జాక్స్ ను కొనుగోలు చేయగా.. అంతగా గొప్పగా రాణించడం లేదని తెలుస్తోంది. తక్కువ ధరకే మంచి ఆటగాడిని ఆర్సీబీ దక్కించుకుంది. భవిష్యత్తులో కూడా టిమ్ డేవిడ్ మంచి ప్రదర్శన ఇస్తాడని ఆర్సీబీ ఆశిస్తోంది.

Story first published: Friday, April 25, 2025, 18:56 [IST]
Other articles published on Apr 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+