Mumbai vs Chennai Preview: తొలి దెబ్బ ఎవరిది.. బరిలోకి దిగే జట్లు ఇవే!

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చింది. కరోనా నేపథ్యంలో అసలు జరుగుతుందో లేదో అనే సందిగ్ధం నెలకొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌‌ మరికొద్ది గంటల్లోనే షురూ కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, త్రీ టైమ్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. విజయంతో ఈ ఐపీఎల్ జర్నీని ప్రారంభించాలని ఇరు జట్ల తహతహలాడుతున్నాయి.

తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ భావిస్తుండగా.. గతేడాది ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. ఇరు జట్ల బలబలాల పరంగా సమంగానే ఉండటంతో హోరాహోరీ పోరు తప్పదు. అభిమానులకు కావాల్సిన మజా ఫస్ట్ మ్యాచ్‌లోనే లభించనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు ఆడగా ముంబై 18 సార్లు, చెన్నై 12 సార్లు గెలిచింది.

అంతా ధోనీపైనే

అంతా ధోనీపైనే

పది సీజన్లు.. మూడుసార్లు విజేత.. ఐదుసార్లు రన్నరప్​.. ఓసారి సెమీస్​... మరోసారి ప్లే ఆఫ్స్​.. ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ ట్రాక్ రికార్డు ఇది. కానీ సీఎస్​కే బలం మొత్తం ధోనీనే. ఇందులో సందేహమే లేదు. అంతర్జాతీయ ఆటగాళ్లున్నా.. గ్రౌండ్​లో ధోనీ వ్యూహాలపైనే మ్యాచ్​ ఆధారపడి ఉంటుంది. ఇది ఆల్​రౌండర్ల జట్టు. బాగా నమ్మకం పెట్టుకోదగిన ప్లేయర్లు వాట్సన్​, డుప్లెసిస్​, రాయుడు అండగా ఉండటం కలిసొచ్చే అంశం. ఎంతటి ఒత్తిడిలోనైనా ఈ త్రయం పరుగులు రాబట్టడంలో దిట్టలు. వీళ్లు చెలరేగితే చెన్నైకి తిరుగుండదు.

రైనా ప్లేస్‌లో రాయుడు..

రైనా ప్లేస్‌లో రాయుడు..

వ్యక్తిగత కారణాలతో లీగ్​ నుంచి తప్పుకున్న సురేశ్​ రైనా, స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ లేకపోవడం ప్రతికూలాంశం. ఈ ఇద్దరిలో ఒక్కరున్నా సీఎస్​కే బలం రెట్టింపు అయ్యేది. యూఏఈలో అన్ని పిచ్​లు స్పిన్​కు అనుకూలమనే వార్తల నేపథ్యంలో భజ్జీ ఉంటే బాగుండేది. రైనా గైర్హాజరీతో నెంబర్​-3 ఖాళీగా కనిపిస్తున్నది. అయితే వాట్సన్, డూప్లెసిస్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉండగా రైనా ప్లేస్‌ను రాయుడుతో భర్తీ చేసే అవకాశం ఉంది. అతనితో ధోనీ, జాదవ్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు.

ఆల్​రౌండర్స్​ రవీంద్ర జడేజా,​ డ్వేన్​ బ్రావో.. సీఎస్​కే అమ్ములపొదిలో వజ్రాయుధాలు. తుది జట్టులో వీరికి అవకాశం దక్కడం ఖాయం. బౌలింగ్​ కాంబినేషన్స్​ కూడా చాలా ఉండటం అనుకూలాంశం. దీపక్ చాహర్, శార్ధుల్ ఠాకుర్‌తో కలిసి బ్రావో పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. జడేజాతో కలిసి ఇమ్రాన్ తాహిర్, పియూష్ చావ్లాలు స్పిన్నర్లుగా బరిలోకి దిగనున్నారు. కేదార్ జాదవ్ రూపంలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఉన్న నేపథ్యంలో మరో పేసర్ కావాలనుకుంటే తాహిర్ స్థానంలో ఎంగిడి రావచ్చు.

బలంగా ముంబై..

బలంగా ముంబై..

ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం...ముంబై ఇండియన్స్‌‌ శైలి‌. అయితే ఆ జట్టు అన్ని విధాల సమతూకంగా ఉంది. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌‌ లిన్‌‌‌ను తీసుకున్నా ఫస్ట్ మ్యాచ్‌లో అతనికి అవకాశం దక్కడం డౌటే. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్‌తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌‌ ఆరంభించే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, కీరన్ పొలార్డ్‌లతో మరింత బలంగా ఉంది. ముఖ్యంగా పొలార్డ్ ఫామ్ ఆ జట్టుకు కలిసి రానుంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్‌తో ఏనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ లైనప్ బాగుంది.

అదే ముంబై సమస్య..

అదే ముంబై సమస్య..

బ్యాటింగ్‌లో బలంగా ఉన్న ముంబై.. బౌలింగ్‌లో మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం ఆ జట్టును ఇబ్బంది పెట్టే అంశం. యూఏఈ పిచ్‌‌లకు తగ్గట్టు నాణ్యమైన స్పిన్నర్లు ముంబైలో లేరు. తుది జట్టులో ఫిట్ అయ్యే రాహుల్‌‌ చహర్​, కృనాల్‌‌ పాండ్యా వికెట్‌‌ టేకింగ్‌‌ బౌలర్లకంటే రన్‌‌ సేవింగ్‌‌ స్పిన్నర్లు అనొచ్చు. ఇక మలింగా గైర్హాజరీతో బుమ్రాపైనే పేస్ భారం పడనుంది. అతను కూడా న్యూజిలాండ్ సిరీస్‌లో తెలిపోయాడు. తనను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌‌ నుంచి ట్రేడింగ్‌‌ ద్వారా తీసుకున్న కివీస్‌‌ స్పీడ్‌‌స్టర్​ ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ బుమ్రాతో పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. మరో పేసర్‌గా నాథన్‌‌ కౌల్టర్ ​నిల్‌‌, మెక్లీగన్‌లో ఒకరు తుది జట్టులో ఉండవచ్చు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

చెనై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్/లుంగి ఎంగిడి, షార్ధుల్ ఠాకుర్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, నాథన్ కౌల్టర్ నీల్/మిచెల్ మెక్‌గ్లేన్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

పిచ్:

పిచ్:

స్పిన్నర్లకు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం లేదు. వర్ష సూచన లేదు. స్పిన్నర్లే మ్యాచ్‌ను శాసించవచ్చు. 2014 ఐపీఎల్‌లో ఈ మైదానంలో ఏడు మ్యాచ్‌లు జరగ్గా సగటు జట్టు స్కోర్ 147. శనివారం 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

చైనా కంపెనీ ‘ఒప్పో'తో ధోనీ ఒప్పందం.. మండిపడుతున్న ఫ్యాన్స్!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 18, 2020, 20:23 [IST]
Other articles published on Sep 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X