సిరిస్ ఓటమి: కుక్ అవుట్!, తదుపరి కెప్టెన్ ఎవరు?
హైదరాబాద్: ముంబై టెస్టు విజయంతో ఇంగ్లాండ్‌పై ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా ఇకపై తాను తక్కువ మ్యాచ్‌లకే ఉంటానని ముంబై టెస్టు ఓటమి అనంతరం మీడియాతో అలెస్టర్ కుక్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ టెస్టు సిరిస్‌తో ఇంగ్లాండ్ జట్టు తరుపున అత్యధిక టెస్టులకు సారధ్యం వచ్చిన కెప్టెన్‌గా అలెస్టర్ కుక్ ఘనతను సాధించాడు. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
'అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాం. తొలి ఇన్నింగ్స్‌లో 230/2 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన మేము 400కే పరిమితమయ్యాం. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై సరైన స్కోరు చేయలేకపోవడం దెబ్బతీసింది. కోహ్లీ, జయంత్, విజయ్ ఇచ్చిన క్యాచ్‌లను జారవిడువడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాం. ఈ ముగ్గురి సెంచరీలతో ఆ జట్టు 600కు పైగా స్కోరు నమోదు చేసింది.' అని కుక్ పేర్కొన్నాడు.

భారీ మూల్యం చెల్లించుకున్నాం
సరైన సమయంలో వికెట్లను తీయలేకపోవడం వల్లే భారీ మూల్యం చెల్లించుకున్నామని కుక్ వెల్లడించాడు. ముఖ్యంగా కోహ్లీ, యాదవ్, విజయ్‌లను ఔట్ చేయడంలో మా ప్రణాళికలను ఫలింలేదని కుక్ తెలిపాడు. ముంబై టెస్టులో విజయ్ (136), జయంత్ యాదవ్ (104), కోహ్లీ (235) రాణించడంతో భారత్ విజయం సాధించింది. మరోవైపు తన సహచర ఆటగాడు జో రూట్‌ను కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని కుక్ పేర్కొన్నాడు.
అంతేకాదు తమ భవిష్యత్ కెప్టెన్ జో రూట్ అని పేర్కొన్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో రూట్ కెప్టెన్‌గా వ్యవహరించాడని, ప్రతీ ఒక్కరికీ అత్యంత గౌరవం ఇచ్చే ఆటగాడని కొనియాడాడు. తాను మ్యాచ్ గెలిచినా, ఓడినా ముందుగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపాడు. అయితే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ తో చర్చించిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని కుక్ వెల్లడించాడు.

2012లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా కుక్
2012లో ఇంగ్లాండ్ జట్టుకు కుక్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ ఏడాది భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరిస్‌ను 2-1తో గెలుచుకుంది. కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు 24 టెస్టుల్లో విజయం సాధించింది. కుక్ నేతృత్వంలోని రెండు యాషెస్ సిరీస్ లను ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది.

భారత్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం
2006లో భారత్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ టెస్టు కెరీర్‌ను ఆరంభించిన కుక్ అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ 135 టెస్టులు ఆడిన కుక్ 10,688 పరుగులను సాధించాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు.

సచిన్ రికార్డుని కూడా అధిగమించిన కుక్
ఇక అత్యంత వేగంగా 8వేల టెస్టు పరుగులను, 10వేల పరుగులను నమోదు చేసిన రికార్డుని సైతం అలెస్టర్ కుక్ నెలకొల్పాడు. దీంతో క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని కూడా కుక్ అధిగమించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టులతో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (135) ఆడిన ఆటగాడిగా అలెక్ స్టివార్ట్ (133 మ్యాచ్‌లు) రికార్డును కుక్ అధిగమించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications