Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ మరో ఘనత: ముంబై టెస్టులో నమోదైన రికార్డులివే

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను సాధించాడు. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు.

భారత్ తరుపున అత్యధిక వికెట్లు

భారత్ తరుపున అత్యధిక వికెట్లు

ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మొయిన్ అలీ వికెట్‌ను తీయడంతో భారత్ తరుపున అత్యధిక వికెట్లు సాధించిన ఏడో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఘనత సాధించాడు. దీంతో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు.

మాజీ పేసర్ శ్రీనాథ్ రికార్డును అధిగమించిన అశ్విన్

మాజీ పేసర్ శ్రీనాథ్ రికార్డును అధిగమించిన అశ్విన్

ముంబై టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అశ్విన్ 235 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఈ టెస్టులో జో రూట్, మెయిన్ అలీ వికెట్లను తీయడంతో శ్రీనాథ్ రికార్డును అశ్విన్ అధిగమించాడు. ముంబై టెస్టు తొలిరోజు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ మొత్తం 30 ఓవర్లు వేసి 75 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

ముంబై టెస్టులో అశ్విన్ మాయ

ముంబై టెస్టులో అశ్విన్ మాయ

వాంఖడేలో అశ్విన్‌ మాయ చేశాడు. వెంట వెంటనే వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ జట్టుని దెబ్బకొట్టాడు. సెంచరీ, అర్ధ సెంచరీలతో ఇంగ్లాండ్‌ను ఆదుకొన్న జెన్సింగ్స్‌ (112), మొయిన్‌ అలీ (50)ని ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపించడంతో మ్యాచ్‌పై కోహ్లీ సేన పట్టు బిగించింది. దీంతో తొలిరోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్‌

200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్‌

ఇటీవలే 200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అశ్విన్ ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ రాణిస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+