Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నన్ను ఎవడ్రా ఆపేదీ.. టీమిండియాలో చోటు దక్కించుకుంటా!': రోహిత్ శర్మ ఫ్రెండ్

టీమిండియాలో తాను తిరిగి స్థానం దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు 33ఏళ్ల సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న అతడు... భారత జట్టులో చోటు దక్కించుకునే విషయంపై ఇప్పటికీ తాను పోటీలోనే ఉన్నట్లు తెలిపాడు. తాజాగా హరియాణాతో జరిగిన రంజీ క్వార్టర్ ఫైనల్ లో 18.5 ఓవర్లలో 58 పరుగులిచ్చి వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బతీశాడు. ఈ నేపథ్యంలో అతడు తన ఫామ్ తో పాటు టీమిండియాలో చోటు గురించి మాట్లాడాడు.

ఎవరికైనా సహజమే కదా..
"టీమిండియాలో చోటు దక్కకపోతే బాధ, నిరాశ కలగడం ఏ క్రికెటర్ కైనా సహజమే. క్రికెట్ ఆడకుండా ఇంట్లోనే కూర్చుంటే ఆలోచనలు ఎక్కువైపోతాయి. నేను ఒక్కసారి మైదానంలోకి దిగితే నా దృష్టంతా ఆటపైనే ఉంటుంది. క్లబ్, ఐపీఎల్, రంజీ, భారత జట్టు.. ఎందులో అయినా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వాలనే ఆశిస్తాను. మరో ఆలోచన ఉండదు" అని చెప్పుకొచ్చాడు.

Mumbai Ranji player Shardul Thakur says he Comeback in teamindia with India s England Tour

పోటీలోనే ఉన్నా..
టీమిండియాలో చోటు కోసం తాను పోటీలోనే ఉన్నానని అన్నాడు శార్దూల్. జూన్‌ - జులైలో ఉండబోయే ఇంగ్లాండ్‌ టూర్ తో భారత జట్టులోకి పునరాగమనం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియాలో స్థానం సంపాదించడమే తన దృష్టి అని, అదే ఎప్పుడూ తన లక్ష్యమని అన్నాడు.

ఐదో టాప్ స్కోరర్ గా...
ప్రస్తుతం దేశవాళీలో అడుతోన్న అతడు.. గత 9 ఇన్నింగ్స్‌ల్లో 44 సగటుతో 396 పరుగులు చేసి.. ముంబయి జట్టులో ఐదో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో ఓ శతకం, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. బంతితోనూ 32 వికెట్లు తీశాడు. టీమిండియా తరఫున 11 టెస్టులు, 47 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, శార్దూల్ ఠాకూర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ముంబయి రంజీ జట్టులో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. వీరిద్దరు బయట కూడా మంచి సన్నిహితులే.

Story first published: Tuesday, February 11, 2025, 9:11 [IST]
Other articles published on Feb 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+