Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గ్రేట్ ప్లేయర్ కావడం ఎలా?: పాండ్యా, రాహుల్‌పై ముంబై పోలీస్ ట్వీట్

Mumbai Police takes a subtle dig at Hardik Pandya, KL Rahul over sexist remarks

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లకు ముంబై పోలీసులు వినూత్న రీతిలో 'గుణపాఠం' నేర్పే ప్రయత్నం చేశారు. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొవడంతో వీరిద్దరూ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయంలో వారికి హితబోధ చేస్తూ ముంబై పోలీసులు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఓ గొప్ప ఆటగాడు ఎలా ఉం డాలి? మైదానంలో అత్యధిక స్కోరు చేయాలి.. మైదానం వెలుపల మహిళల పట్ల గౌరవంతో మెలగాలి" అని బ్యాక్‌గ్రౌండ్‌లో పిచ్‌ను ఉంచిన ఇమేజిపై పేర్కొన్నారు.

అలాగే 'ఎక్కడైనా.. ఎప్పుడైనా ఓ జెంటిల్‌మన్‌ అంటే జెంటిల్‌మన్‌గానే ఉండాలి..' అంటూ ట్వీట్‌ పెట్టారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అసలేం జరిగింది?:
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు.

తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి
మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు. తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి 'ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారంకాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు.

Story first published: Wednesday, January 16, 2019, 11:19 [IST]
Other articles published on Jan 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+