న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డయల్ 100: పృథ్వీషా సెంచరీపై ముంబై పోలీస్ వినూత్న ట్వీట్

Mumbai Police exemplifies Prithvi Shaw in their campaign of ‘Dial 100’

హైదరాబాద్: తన అరంగేట్ర టెస్టులో సెంచరీ చెలరేగిన ఓపెనర్ పృథ్వీషాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీషా 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు.

సచిన్ క్రికెట్‌కు 'దేవుడైతే', ధోని 'కింగ్ ఆఫ్ క్రికెట్': పుస్తకం రాయనున్న స్పిన్నర్సచిన్ క్రికెట్‌కు 'దేవుడైతే', ధోని 'కింగ్ ఆఫ్ క్రికెట్': పుస్తకం రాయనున్న స్పిన్నర్

తద్వారా అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్ర టెస్టులో సెంచరీతో భారత్ తరుపున ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో ముంబై పోలీస్ "ఇదొక చక్కటి శుభారంభం... ఆల్ ద బెస్ట్ టు యు" అంటూ ట్విట్టర్‌లో వినూత్నంగా ట్వీట్ చేసింది.

ఈ మ్యాచ్‌లో పృథ్వీషా 154 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 134 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దేవేంద్ర బిషు బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో పృథ్వీషా అనేక రికార్డులు నమోదు చేశాడు.

రాజ్‌కోట్ టెస్టు: అరంగేట్ర టెస్టులో సెంచరీతో చరిత్ర సృష్టించిన పృథ్వీషారాజ్‌కోట్ టెస్టు: అరంగేట్ర టెస్టులో సెంచరీతో చరిత్ర సృష్టించిన పృథ్వీషా

పృథ్వీషా సెంచరీతో నమోదైన రికార్డులు:

0 - పృథ్వీషాకు ముందు ఏ భారత టీనేజర్ కూడా టెస్టుల్లో తొలి బంతిని ఎదుర్కొనలేదు. టెస్టుల్లో తొలి బంతని ఎదుర్కొన్న పిన్న వయస్కుడిగా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. మొత్తంగా చూస్తే ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్ అంతకముందు హామిల్టన్ మసకడ్జ, తమీమ్ ఇక్బాల్, ఇమ్రాన్ ఫర్హాత్‌లు ఉన్నారు.

1 - భారత్ తరుపున అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. టెస్టుల్లో తొలి సెంచరీ సమయానికి పృథ్వీషా వయసు 18 ఏళ్ల 329 రోజులు. అంతేకాదు టెస్టుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన పిన్న వయస్కుడిగా కూడా పృథ్వీషా నిలిచాడు.

2 - అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన నాలుగో అతి చిన్న వయసు బ్యాట్స్‌మన్. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్. సచిన్ (17 ఏళ్ల 112 రోజులు) తర్వాత టెస్టుల్లో సెంచరీ చేసిన అత్యంత చిన్న వయసు బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో సెంచరీ చేసిన ఏడో అత్యంత చిన్న వయసు బ్యాట్స్‌మన్.

3 - రాజ్ కోట్ టెస్టులో పృథ్వీషా కేవలం 99 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా తొలి టెస్టులో వంద బంతుల్లోపు సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్. గతంలో శిఖర్ ధావన్ (85), డ్వేన్ స్మిత్ (93) ఈ ఘనత సాధించారు.

1
44264

4 - భారత్ తరుపున అతి తక్కువ వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా నిలిచాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ (9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు) తర్వాత అతి తక్కువ అనుభవంతో టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన బ్యాట్స్‌మన్‌గా పృథ్వి షా నిలిచాడు. పృథ్వి షా కేవలం 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గత పదేళ్లలో భారత్‌కు ఆడిన అత్యంత చిన్న వయసు ప్లేయర్ కూడా ఇతడే కావడం విశేషం.

10 - అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన 10వ టీనేజర్‌గా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. జాక్సన్, జావెద్ మియాందాద్, కేడీ వాల్టర్స్, ఉమర్ అక్మల్, హామిల్టన్ మసకడ్జ, మహమ్మద్ ఆష్రపుల్, మహమ్మద్ వాసీం, ఆడ్రియన్ భరత్, సలీమ్ మాలిక్‌ల సరసన చేరాడు.

13 - భారత్ తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 13వ పిన్న వయస్కుడు పృథ్వీషా. ఇషాంత్ శర్మ(2007) తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడు.

15 - అరంగేట్ర టెస్టుల్లో సెంచరీ చేసిన 15వ భారత బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో పృథ్వీషా మాజీ క్రికెట్ దిగ్గజాలైన సౌరవ్ గంగూలీ, మహమ్మద్ అజహరుద్దీన్ ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

Story first published: Thursday, October 4, 2018, 19:09 [IST]
Other articles published on Oct 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X