Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsCSK : ఆర్చర్‌ ఆడటం అనుమానమే?.. చెన్నైతో తలపడే ముంబై టీం ఇదే!

చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు రెడీ అయిన ముంబై ఇండియన్స్‌కు షాక్ తగిలింది. చెన్నై మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ముంబై స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు గాయమైంది. భుజానికి గాయం అవడంతో అతను చెన్నైతో మ్యాచ్ ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. ఒకవేళ ఆర్చర్ కనుక ఆడకపోతే బౌలింగ్ భారమంగా జేసన్ బెహ్రండాఫ్ మీదనే పడుతుంది.

గాయంతో ఆర్చర్ తప్పుకుంటే తప్ప ముంబై జట్టులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ముంబై తమ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. కానీ ముంబై బ్యాటింగ్‌లో కావలసినంత ఫైర్ పవర్ ఉంది. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ మరోసారి కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఫామ్ లేక తంటాలు పడుతున్న సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించాలి.

mumbai indians practice

కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. తొలి మ్యాచ్‌లో విఫలమయ్యారు కదా అని వీళ్లెవరినీ తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. అలా చేస్తే ఎలాంటి జట్టుకైనా షాక్ ఇచ్చే సత్తా ముంబైకి ఉంది. రోహిత్, ఇషాన్ ఇద్దరూ మంచి ఓపెనింగ్ అందిస్తే ముంబై భారీ స్కోరు చేయడం ఖాయం. చెన్నై ప్రధాన పేసర్ దీపక్ చాహర్ కూడా సరైన లయలో బౌలింగ్ చేయడం లేదు.

చాహర్ ఫామ్ లేమిని కనుక ముంబై ఓపెనర్లు యూజ్ చేసుకుంటే వాళ్లు గాడిలో పడే అవకాశం ఉంది. వాంఖడేలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ముంబై పట్టుదలగా ఉంది. బౌలర్లలో హృతిక్ షోకీన్ గత మ్యాచ్‌లో తేలిపోయినా.. ఈ మ్యాచ్‌లో అతనే కీలకం అయ్యే ఛాన్స్ ఉంది. స్పిన్ దళం బాధ్యతలను మోసేందుకు పియూష్ చావ్లా రెడీ అవుతున్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టు (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వధీర, హృతిక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, జేసన్ బెహ్రెండాఫ్

ఇంపాక్ట్ ప్లేయర్ అభ్యర్థులు: పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, విష్ణు వినోద్, రమణ్‌దీప్ సింగ్, షామ్స్ ములాని

Story first published: Saturday, April 8, 2023, 13:13 [IST]
Other articles published on Apr 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+