Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి ఓవర్లోనే ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ డకౌట్

mumbai lost 3wickets in 3overs

ఐపీఎల్‌-2022లో భాగంగా గురువారం డివై పాటేల్‌ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌ వర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆదిలోనే భారీ షాక్ తగలింది. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే డక్ ఔట్ అయ్యాడు. ముఖేష్ చౌదరి వేసిన తొలిఓవర్ రెండో బంతిని రోహిత్ హిట్ చేయగా.. అది లెగ్ సైడ్‌లో ఉన్న సాంట్నర్ చేతిలో పడింది. అలాగే తొలి ఓవర్లోనే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ కూడా డకౌట్ అయ్యాడు. తొలి ఓవర్ అయిదో బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో స్టాండ్స్ లో ఉన్న ముంబై అభిమానులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ముఖేష్ చౌదరి లైన్ అండ్ లెంత్‌తో చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక తొలి ఓవర్లో 6పరుగులిచ్చిన ముఖేష్ రెండు కీలక వికెట్లు పడగొట్టి ముంబైకి గట్టి షాకిచ్చాడు. ఇప్పుడు జట్టు భారాన్ని మరోసారి సూర్యకుమార్ యాదవ్ మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రెండో ఓవర్ వేసిన సాంట్నార్ సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. ఈ ఓవర్లోనూ రెండు వికెట్లు పడేవి. బంతిని హిట్ చేయబోయిన సూర్య మిస్ కావడంతో అది కీపర్ సైడ్ వెళ్లింది.. కానీ ధోనీకి దొరకకపోవడంతో బతికి పోయాడు. తర్వాత డెవిన్ బ్రెవిస్ సైతం రెండో ఓవర్ చివరి బంతికి హిట్ చేయాలని చూడగా.. బంతి గాల్లోకి లేచింది. జడేజా ఈ క్యాచ్ మిస్ చేశాడు. ఇక ముఖేష్ చౌదరి వేసిన మూడో ఓవర్లో చివరి బంతికి బ్రెవిస్ (4) కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 3ఓవర్లకు ముంబై 3వికెట్లు కోల్పోయి 23పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (15 పరుగులు), తిలక్ వర్మ

ఐపీఎల్లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 32మ్యాచ్‌లు జరగ్గా చెన్నై 19, ముంబై 13 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు. చెన్నై ఆడిన ఆరు మ్యాచుల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.

mumbai lost 3wickets in 3overs

ఇరు తుది జట్లు ఇవే
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (w), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని (w), డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

Story first published: Friday, April 22, 2022, 8:10 [IST]
Other articles published on Apr 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+