Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దూసుకు పోతున్న సచిన్ సేన: ఢిల్లీపై ముంబయి గెలుపు

Mumbai Indians
ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో ముంబయి ఇండియన్స్ ఐపీఎల్-4లో దూసుకెళుతోంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను అన్నిరంగాల్లో చిత్తు చేస్తూ మొత్తమ్మీద ఎనిమిదో విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై సెహ్వాగ్ సేనతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 32 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. బ్యాటింగ్‌లో తెలుగుతేజం రాయుడు 59, రోహిత్ శర్మ 32 వార్నర్ 37చెలరేగడంతో ముంబయి నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 178 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లు మలింగ (2/18) హర్భజన్ (2/24), మునాఫ్ (2/29) ధాటికి ఏడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ... చివరికి 19.5 ఓవర్లలో 146 పరుగులకే చేతులెత్తేసింది. పోరాటపటిమ ప్రదర్శించిన హోప్స్ 55, వేణు 37, ఇర్ఫాన్ పఠాన్ 23 బాగా ఆడినప్పటికీ విజయం దరి చేరలేక పోయింది.

ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభం డెక్కన్‌తో మ్యాచ్‌ను తలపించింది. తొలి ఓవర్‌లోనే వికెట్. మొదటి ఓవర్ విసిరిన భజ్జీ వార్నర్‌ను బలిగొన్నాడు. ఇక రెండో ఓవర్లో మలింగ ఇన్‌స్వింగింగ్ యార్కర్‌కు ఇంగ్రామ్ అవుట్. అప్పటికి ఢిల్లీ ఖాతాలో చేరింది నాలుగు పరుగులే. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే చార్జర్స్ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన వీరూకు ఈసారి నో చాన్స్. మునాఫ్ ఓ షార్ట్ డెలివరీతో సెహ్వాగ్ కథ ముగించాడు. హోప్స్, వేణు మెరిసినా: ఏడు పరుగులకే నాలుగు టాపార్డర్ వికెట్లను కోల్పోయిన ఢిల్లీని వేణు, హోప్స్ ఆదుకున్నారు. అయితే వేణు అవుటవడంతో 87 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ఐదు పరుగుల తేడాతో హోప్స్, నాగర్ 0, ఇర్ఫాన్‌లు అవుట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి బ్లిజార్డ్ అదిరిపోయే ఆరంభాన్నివ్వడంతో స్కోరు ఐదు ఓవర్లలోనే 50 పరుగుల మార్కు చేరుకుంది. నాలుగు పరుగుల తేడాతో బ్లిజార్డ్, సచిన్‌లు పెవిలియన్ చేరడంతో బ్యాటింగ్ బాధ్యతలు రాయుడు, రోహిత్‌లు స్వీకరించారు. మూడో వికెట్‌కు 87 రన్స్ జోడించిన ఈ జంట తొలుత నిదానంగా ఆడినా ఆనక విజృంభించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+