Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ మాకు క్రికెట్లో టెక్నిక్స్ నేర్పిస్తున్నాడు.. ముంబై కుర్రాళ్ల సంతోషం మామూలుగా లేదుగా

mumbai indians shares special video on sachin birthday

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నేటితో 49ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. సచిన్ బర్త్‌డే సందర్భంగా అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టెండూల్కర్ భారత క్రికెట్‌కు అందించిన సేవలకు వెలకట్టలేం. 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్.. టెస్టులు, వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఇప్పటికి తన రికార్డ్‌ను కొనసాగిస్తున్నాడు. టెండూల్కర్ అంతర్జాతీయ కెరీర్ గురించి చాలా మందికి తెలిసిందే. ఇకపోతే అతను 2008లో ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ నుంచి 2013వరకు ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడాడు. అతను ముంబై ఇండియన్స్ తరఫున మొత్తం 78 మ్యాచ్‌లు ఆడి 33.83సగటుతో 2,334 పరుగులు చేశాడు. 120కి మించి స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. 2010సీజన్లో సచిన్ చెలరేగిపోయాడు. అతను ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్‌ దక్కించుకున్నాడు. 47.53సగటుతో, 132.61 స్ట్రైక్ రేట్‌తో 618పరుగులు చేసి టాప్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

తదనంతరం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ టెండూల్కర్ ఎప్పుడూ ముంబై ఇండియన్స్ జట్టుకు వెన్నుదన్నుగానే ఉన్నాడు. మెంటార్‌గా ముంబై ఇండియన్స్‌‌కు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాడు. ముంబై ఫ్రాంచైజీ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 5టైటిల్స్‌ గెలవడంతో మెంటార్‌గా కీ రోల్ పోషించాడు. ప్రస్తుత సీజన్లోనూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యువకులకు దిశానిర్దేశం చేస్తూ వాళ్లలో స్ఫూర్తి రగిలిస్తున్నాడు.

టెండూల్కర్ బర్త్‌డే సందర్భంగా.. ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పెషల్ వీడియోను పోస్టు చేసింది. ముంబైకి ఆడుతున్న కొత్త కుర్రాళ్లు.. సచిన్ గురించి ఈ వీడియోలో తమ అభిప్రాయాలను తెలిపారు. క్రికెట్ లెజెండ్‌తో మొదటిసారి కలుసుకున్న తమ సంతోషాన్ని పంచుకున్నారు. డెవాల్డ్ బ్రెవిస్, హృతిక్ షోకీన్, ఆర్యన్ జువాల్, తిలక్ వర్మ, రాహుల్ బుద్ధి మాట్లాడుతూ.. సచిన్ లాంటి ప్లేయర్‌ను కలవడమే గొప్ప అనుకుంటే.. స్వయంగా ఆయనే మాకు తర్ఫీదు, సూచనలు ఇవ్వడం అద్భుతంగా ఉందన్నారు. సచిన్ మార్గదర్శకత్వంలో మేము ఆడుతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నామన్నారు. చివర్లో అందరూ సచిన్‌కు హ్యాపీ బర్త్ డే చెప్పారు. ఇక సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ సైతం స్పందిస్తూ.. నా జీవితంలో ఎన్నో అందించావ్ నాన్న.. హ్యాపీ బర్త్ డే టు యూ అంటూ ముగించాడు.

ఇక ట్విట్టర్‌తో పాటు కూ యాప్‌లో కూడా సచిన్ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్లో ఉన్నాయి. చాలా మంది సచిన్ కోసం స్పెషల్ డీపీలు పెడుతున్నారు. కొందరు సచిన్ రికార్డుల గురించి.. మరికొందరు సచిన్ స్పెషల్ ఇన్నింగ్స్‌ల గురించి పోస్టులు చేస్తున్నారు. సింపుల్ గా సచిన్ ఇంటర్నేషనల్ కెరీర్ గురించి గణాంకాల్లో పరిశీలిస్తే..
క్రికెట్ కెరీర్ 24 ఏళ్లు, మ్యాచులు 664 , ఇన్నింగ్స్ 782 , పరుగులు 34,357, సగటు 48.52, అత్యధిక స్కోరు 248, హాఫ్ సెంచరీలు 164, 90 నుంచి 99 పరుగుల దగ్గర ఔటయినవి 28, సెంచరీలు 100, డబుల్ సెంచరీలు 7, ఫోర్లు 4076, సిక్సర్లు 264, వికెట్లు 201, 5వికెట్ల హౌల్ 2, బౌలింగ్ బెస్ట్ 5/32, మెయిడిన్లు 107, క్యాచులు 256.

Story first published: Sunday, April 24, 2022, 15:50 [IST]
Other articles published on Apr 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+