బుమ్రా బర్త్‌డే: అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై ముంబై ఇండియన్స్ ఫన్నీ ట్వీట్

హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన ముందు ఓ 'బేబి బౌలర్' అంటూ పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ సోషల్ మీడియాలో నవ్వులు పాలయ్యాడు. సుదీర్ఘకాలం పాక్‌కు ప్రాతినిథ్యం వహించిన తాను వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొన్నాననీ.. అందులో గ్రేట్ గ్లెన్ మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్ లాంటి వారు ఉన్నారన్నారని అన్నాడు.
అయితే, వారితో పోలిస్తే బుమ్రా తన ముందు ఓ బేబీ బౌలర్‌ని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో అబ్దుల్ రజాక్‌ను విపరీతంగా ట్రోల్ కూడా చేశారు. రజాక్ బుమ్రాపై చేసిన వ్యాఖ్యలు జోక్ ఆఫ్ ది ఇయర్ అని, రజాక్ ప్రపంచంలోనే అత్యంత భయంకర బౌలరని విమర్శలు గుప్పించారు.
రజాక్ వ్యాఖ్యలపై
రజాక్ వ్యాఖ్యలపై ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ తన ట్విట్టర్‌లో కాస్తంత ఫన్నీగా స్పందించింది. శుక్రవారం 26వ పుట్టినరోజుని జరుపుకుంటున్న జస్ప్రీత్ బుమ్రాకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తన ట్విట్టర్‌లో "బేబి బౌలర్ టు వరల్డ్ బీటర్" అంటూ బుమ్రా యువకుడిగా ఉన్న ఫోటోలను పోస్టు చేసింది.

ట్వీట్ వైరల్
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ "గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ లాంటి దిగ్గజ బౌలర్లతో కలిసి ఆడాను. నా ముందు బుమ్రా బేబి బౌలర్. నేను అతడిపై సులభంగా ఆధిపత్యం చెలాయించి పరుగుల వరద పారించేవాడిని" అని చెప్పుకొచ్చాడు.

బుమ్రా యాక్షన్ భిన్నం
"నా కాలంలో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న తరువాత, బుమ్రా వంటి బౌలర్‌పై నాకు ఎటువంటి సమస్య ఉండేది కాదు. అతనిపైనే ఒత్తిడి ఉండేది. బుమ్రా చాలా బాగా రాణిస్తున్నాడు. చాలా మెరుగయ్యాడు కూడా. అతడి యాక్షన్ భిన్నంగా ఉంటుంది. సీమ్‌ను ఖచ్చితంగా ఉంటుంది కాబట్టే అతను ప్రభావవంతమైన ఆటగాడు కాగలిగాడు" అని రజాక్ అన్నాడు.
జిమ్‌లో బుమ్రా కసరత్తలు
జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయం నుంచి కోలుకోవడంతో జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనర్ రజనీకాంత్ శివజ్ఞానమ్‌తో కలిసి ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో వర్కౌట్లు మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బుమ్రా తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటూ "ఈ వారం ఈ విధంగా జంపింగ్ చేసేందుకు సిద్దమయ్యా" అంటూ కామెంట్ పెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications