Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mumbai Indians: రోహిత్‌ను తప్పిస్తే తప్పేంటి? - ఏబీ డివిలియర్స్

రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా ముంబయి ఇండియన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో అయిదు టైటిళ్లు అందించిన సక్సెఫుల్ కెప్టెన్ రోహిత్‌ను తప్పించడంపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. మరోవైపు హిట్‌మ్యాన్ అభిమానులు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ముంబయి ఇండియన్స్‌ను ట్విటర్‌లో దాదాపు 5 లక్షల మంది, ఇన్‌స్టాలో 8 లక్షల మంది అన్‌ఫాలో చేశారు.

అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి ముంబయి ఇండియన్స్‌కు గూటికి చేరే ముందే హార్దిక్ తన కెప్టెన్సీ గురించి క్లారిటీగా మాట్లాడుకున్నడాని తెలుస్తోంది.వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి జట్టు పగ్గాలు అందుకోవడానికి తిరిగి ముంబయికి చేరుకున్నాడని సమాచారం.ఈ విషయాన్నివన్డేప్రపంచకప్ జరిగే టైమ్‌లోనే రోహిత్‌కు ముంబయి ఫ్రాంచైజీ చెప్పగా, హిట్‌మ్యాన్ దానికి అంగీకరించాడంట.

Mumbai Indians: What is wrong with giving the captaincy to Hardik instead of Rohit? - AB de Villiers

మరోవైపు రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్.. నెట్టింట్లో హార్దిక్ పాండ్యపై వస్తున్న వ్యతిరేకతను తప్పుపట్టాడు. మొదటి నుంచి హార్దిక్ ముంబయికి చెందినవాడని గుర్తుచేశాడు.

''ఇది చెత్త నిర్ణయం అని అనుకోవట్లేదు. హార్దిక్ పాండ్య ఎప్పుడూ ముంబయి ఇండియన్స్ వాడే. ఐపీఎల్ కెరీర్ ముంబయి నుంచే ప్రారంభించాడు. అయితే హార్దిక్ పట్ల నెగిటివ్ రియాక్షన్ వస్తుండటంపై ఆశ్చర్యం కలిగిస్తోంది.కెప్టెన్‌గానే జట్టులోకి వస్తానని హార్దిక్ ఆంక్షలు పెట్టాడని నేను భావించట్లేదు. మరోవైపు ఇది రోహిత్ శర్మ నిర్ణయం కూడా అనిపిస్తుంది. అతడు సక్సెఫుల్ కెప్టెన్‌గా ఎన్నో ట్రోఫీలు అందించాడు. అయితే టీమిండియాకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న రోహిత్ ఒత్తిడి తగ్గించుకొని ఐపీఎల్‌లో ఆడటానికి భావించి ఉంటాడని భావిస్తున్నా'' అని డివిలియర్స్ అన్నాడు.

2015లో ముంబయి తరపున హార్దిక్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు సీజన్లకు గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ సక్సెఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. గత రెండు సీజన్లలో గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చడమేగాక 2022 సీజన్‌లో జట్టును విజేతగా నిలిపాడు.

Story first published: Sunday, December 17, 2023, 8:47 [IST]
Other articles published on Dec 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+