Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఆ ముగ్గురిపై ముంబై ఇండియన్స్ కన్ను.. ఎంత ఖర్చయినా కొనేయాలని నిర్ణయం..?

Mumbai Indians want to buy these three players in mini auction

వచ్చే ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ను ఎలాగైనా గెలవాలని ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ భావిస్తోంది. ఈ క్రమంలోనే కొందరు ప్రత్యేక ఆటగాళ్లపై ఫోకస్ పెట్టి మినీ వేలం బరిలో దిగుతోంది. ఈ నెల 23న జరిగే మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒక ముగ్గురు విదేశీ ఆటగాళ్లపై కన్నేసింది. వారి వివరాలు ఒకసారి పరిశీలిస్తే..

జేసన్ హోల్డర్

జేసన్ హోల్డర్

విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను పెద్దగా కారణాలు లేకుండానే లక్నో జట్టు రిలీజ్ చేసింది. గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ తరఫున హోల్డర్ బాగానే ఆడాడు. మొత్తం 12 మ్యాచులు ఆడి 14 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఈ సీజన్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం అతనికి ఎక్కువగా రాలేదు. పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేసే డీసెంట్ ఆల్‌రౌండర్ కోసం వెతుకుతున్న ముంబై.. మరో ఆలోచన లేకుండా హోల్డర్‌ను కొనేయాలని అనుకుంటోందట. అంతేకాదు, అతని బౌలింగ్ ఇటు బుమ్రా, అటు జోఫ్రా ఆర్చర్‌కు మంచి సహకారంగా ఉంటుందని ఆలోచిస్తోందట.

ఆడమ్ జంపా

ఆడమ్ జంపా

గతేడాది ముంబై జట్టులో క్వాలిటీ స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అందుకే ఈసారి ఆసీస్ మ్యాచ్ విన్నర్ ఆడమ్ జంపాను కొనేయాలని ముంబై డిసైడ్ అయిందట. ఆసీస్ తరఫున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన జంపా.. తన కెరీర్‌లో 71 మ్యాచుల్లో 82 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో కూడా అతను సత్తా చాటాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కేవలం 14 మ్యాచులే ఆడిన జంపా.. 17.62 సగటుతో 21 వికెట్లు తీసుకున్నాడు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టే జంపా కోసం ముంబై బాగానే ఖర్చు చేయడానికి రెడీ అవుతోందట.

శామ్ కర్రాన్

శామ్ కర్రాన్

టీ20 వరల్డ్ కప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన శామ్ కర్రాన్ కోసం దాదాపు ప్రతి ఫ్రాంచైజీ పోటీ పడుతుందనేది కాదనలేని సత్యం. ముంబై కూడా ఈ పేసర్ కోసం ట్రై చేస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం అతనికి రాలేదు. కానీ కర్రాన్ ఎంతటి విధ్వంసకర బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఐపీఎల్‌లో కూడా కర్రాన్ రికార్డు మెరుగ్గానే ఉంది. తన కెరీర్‌లో కేవలం 23 ఐపీఎల్ మ్యాచులు మాత్రమే ఆడిన అతను.. 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతను హోల్డర్‌తో కలిసి పంచుకోవడానికి కర్రాన్ సరిగ్గా సరిపోతాడని ముంబై ఇండియన్స్ భావిస్తోందట.

Story first published: Sunday, December 4, 2022, 20:36 [IST]
Other articles published on Dec 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+