Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విశాఖ అందానికి భజ్జీ ఫిదా: సన్‌రైజర్స్Xముంబై.. ఎవరు లోకల్?

విశాఖ: ఆదివారం సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ ఓ ట్వీట్ చేశాడు.

వైజాగ్ అందాలకు భజ్జీ ఫిదా అయ్యాడు. సన్ రైజర్స్‌తో మ్యాచ్ కోసం భజ్జీ విశాఖ చేరుకున్నాడు. సాగర తీరం వెంటే ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేశాడు. ఆ హోటల్ నుంచి సాగర అందాలను చూసి ఫిదా అయ్యాడు. వెంటనే సాగర అందాలను తన ఫోన్లో బంధించి దానిని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

'ఇది వైజాగా లేక డర్బనా...? ఇది వైజాగే గైస్. నా గది నుంచి తీసిన అద్భుత దృశ్యం ఇది' అని కాప్షన్ పెట్టాడు. లోగడ భారత జట్టు కెప్టెన్ ధోనీ కూడా వైజాగ్ అందాలకు ముగ్ధుడయ్యాడు. ఈ రోజు మ్యాచ్ కోసం అందరూ వేచి చూస్తున్నారు.

హర్భజన్ సింగ్ ట్వీట్

హర్భజన్ సింగ్ ట్వీట్

వైజాగ్ అందాలకు భజ్జీ ఫిదా అయ్యాడు. సన్ రైజర్స్‌తో మ్యాచ్ కోసం భజ్జీ విశాఖ చేరుకున్నాడు. సాగర తీరం వెంటే ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేశాడు. ఆ హోటల్ నుంచి సాగర అందాలను చూసి ఫిదా అయ్యాడు. వెంటనే సాగర అందాలను తన ఫోన్లో బంధించి దానిని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

విశాఖ‌లోని డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో హోం జట్టు ముంబై ఇండియ‌న్స్‌తో తెలుగు జట్టు అయిన స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ త‌ల‌ప‌డ‌నుంది.

 ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

కాగా, ముంబై ఇండియన్స్‌లో ఇద్దరు హోంబాయ్స్ ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాదులో మాత్రం ఒక్క తెలుగువాడు లేడు.

 ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

రోహిత్ శర్మ బాల్యం విశాఖలో గడిచింది. ఆ జట్టులో మరో కీలక ఆటగాడు అంబటి రాయుడు గుంటూరుకు చెందిన వ్యక్తి.

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ఈ నేపథ్యంలో విశాఖను హోం గ్రౌండ్‌గా ఎంచుకోవడంతో వారిద్దరూ హోం బాయ్స్‌గా మారారు. ఇక పేరుకే హైదరాదు జట్టైన సన్ రైజర్స్‌లో ఒక్క తెలుగు ఆటగాడు కూడా లేడు.

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

దీంతో, ముంబై ఇండియన్స్ నాన్ లోకల్‌గా వచ్చిన జట్టు అయినప్పటికీ.. ఇప్పుడు హోం జట్టుగా మారడమే కాకుండా, ఇద్దరు తెలుగు ఆటగాళ్లు ఉన్నారు.

 ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

అదే సమయంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో మాత్రం ఒక్క తెలుగు ఆటగాడు కూడా లేడు. ఇదిలా ఉండగా, కెప్టెన్ వార్నర్, కెప్టెన్ రోహిత్ మధ్య పోరుగా ఈ‌మ్యాచ్ ను అభివర్ణించవచ్చు.

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న వార్నర్ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలుస్తున్నాడు. అతనికి తోడు శిఖర్ ధావన్ కూడా కుదురుకోవడంతో సన్ రైజర్స్ విజయాల బాటపట్టింది.

 ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్‌లో సత్తాచాటేందుకు సిద్ధమైంది. నిన్నటి నుంచే ప్రాక్టీస్ ప్రారంభించి సన్ రైజర్స్‌కు షాకివ్వాలని భావిస్తోంది.

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

సన్ రైజర్స్ హైదరాబాదు తెలుగు జట్టు కావడంతో విశాఖలో గతంలో మ్యాచులు జరిగినప్పుడు కూడా విశాఖ అభిమానులు సన్ రైజర్స్‌కు మద్దతు పలికారు.

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

అయితే, ఇప్పుడు మహారాష్ట్రలోని నీటి సమస్య కారణంగా ముంబై ఇండియన్స్ తాత్కాలికంగా విశాఖను హోం గ్రౌండ్‌గా ఎంచుకుంది. ఇప్పుడు విశాఖ అభిమానులు సన్ రైజర్స్ వైపు మొగ్గు చూపుతారా లేక ముంబై వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

మ్యాచ్ దృష్ట్యా పోలీసులు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. స్టేడియం వద్ద 1000 మంది పోలీసులతో గ‌ట్టి భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు.

 ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ట్రాఫిక్ ఆంక్షలతో అక్క‌డి ఎండాడ జంక్షన్ వరకే వాహనాల రాకపోకలను అనుమ‌తించ‌నున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

ముంబై వర్సెస్ సన్‌రైజర్స్

అక్క‌డ జ‌రిగే అన్ని మ్యాచులకు ఈ ఆంక్ష‌లు వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచి స్టేడియంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+