రోహిత్ vs కోహ్లీ: పైచేయి ఎవరిది?
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం క్రికెట్ అభిమానులకు అసలైన కనువిందు కలగనుంది. ఐపీఎల్ టోర్నీలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రెండు జట్లు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తుంటే.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ తమ సొంత గడ్డపై గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని పట్టుదలతో ఉంది.
తడబడుతున్న ముంబై బ్యాటింగ్
ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ ఆరంభంలో ఆరెంజ్ క్యాప్ అందుకునే స్థాయిలో ఆడినప్పటికీ.. మిడిలార్డర్ వైఫల్యం జట్టును వేధిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ నిలకడగా రాణించలేకపోతున్నారు. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో ఇంకా మెరుపులు మెరిపించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ధాటికి బుమ్రా వంటి దిగ్గజ బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకోవడం ముంబై శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది.

బలంగా ఉన్న ఆర్సీబీ
ఆర్సీబీ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ రజత్ పాటిదార్ (142 పరుగులు), విరాట్ కోహ్లీ (129), దేవదత్ పడిక్కల్ (125) ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిలార్డర్‌లో టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్ వంటి హిట్టర్లు జట్టుకు అదనపు బలం. బౌలింగ్‌లో జోష్ హేజిల్‌వుడ్ రాకతో ఆర్సీబీ మరింత పటిష్టమైంది. భువనేశ్వర్ కుమార్‌తో కలిసి అతను కొత్త బంతితో ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
కీలక ఆటగాళ్లు, సమయం:
ముంబై జట్టులోకి మిచెల్ సాంట్నర్ లేదా విల్ జాక్స్ వచ్చే అవకాశం ఉంది, ఇది జట్టు సమతుల్యతను పెంచుతుంది. రాజస్థాన్ చేతిలో ఓడిన తర్వాత ఇరు జట్లు తమ తప్పులను సరిదిద్దుకుని పాయింట్ల వేటలో పడ్డాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉండే పరోక్ష పోటీ ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ మెగా పోరు ఈరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ఫిలిప్ సాల్ట్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రోమారియో షెపర్డ్.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెండ్ బౌల్ట్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, మయాంక్ మార్కండే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications