MI vs KKR Dream11 Prediction: డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! ప్లేయింగ్ ఎలెవన్ అప్‌డేట్!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో మరో ఆసక్తికర పోరుకు సమయం దగ్గరపడుతోంది. అబుదాబి వేదికగా గురువారం ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. షేక్ జాయెద్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే.. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ముఖ్యంగా కోల్‌కతాకు. దాంతో నేటి పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఇక స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్, డిస్ని + హాట్ స్టార్‌లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. సాయంత్రం 6.30కు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో లైవ్ ఆరంభం కానుంది.

అంచనాలను అందుకోని ముంబై

అంచనాలను అందుకోని ముంబై

ఐదుసార్లు ఛాంపియన్లు అయిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2021లో అంచనాలను అందుకోలేదు. మొదటి దశలో ఓటములను ఎదుర్కొంది. ఇక రెండో దశలో ఆడిన మొదటి మ్యాచులోనే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రారంభంలో వికెట్లు తీసి చెన్నైని కట్టడి చేసిన ముంబై.. ఆపై పరుగులు సమర్పించుకుంది. ఇక బ్యాటింగ్లో కూడా విఫలమై మూల్యం చెల్లించుకుంది. దాంతో ఈరోజు కోల్‌కతాపై గెలవడం ముంబైకి తప్పనిసరి అయింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచులో 4 విజయాలు అందుకున్న ముంబై పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

రోహిత్ అనుమానమే

రోహిత్ అనుమానమే

చెన్నైతో జరిగిన మ్యాచులో సౌరబ్ తివారి తప్ప ముంబై బ్యాట్స్‌మన్‌ అందరూ విఫలమయ్యారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ శుభారంభం ఇవ్వలేదు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహంగానే ఉంది. రోహిత్ ఆడేది లేనిది తెలియదు. ఒకవేళ రోహిత్ ఈ మ్యాచ్ ఆడకుంటే.. నేటి మ్యాచులో అన్మోల్‌ప్రీత్‌కు అవకాశం వస్తుందో లేదో చూడాలి.

గత మ్యాచులో విఫలమైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా సత్తాచాటాల్సిన అవసరం ఉంది. సౌరబ్ తివారి హాఫ్ సెంచరీ చేయడం పెద్ద సానుకూలాంశం. ఇక స్టార్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాలు వికెట్లు తీయాల్సిన అవసరం ఎంతో ఉంది. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ ఆడడం అనుమానమే.

ఫాంలో కోల్‌కతా

ఫాంలో కోల్‌కతా

కోల్‌కతా జట్టులో ప్రస్తుతానికైతే ఎవరూ గాయాల బారిన పడలేదు. టీంలో అంతా మంచి ఫాంలోనే ఉన్నారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై కోల్‌కతా అద్భుత విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభమన్ గిల్‌, వెంకటేశ్ అయ్యర్ దంచికొట్టడంతో కేకేఆర్ సునాయాస విజయం అందుకుంది.

ముఖ్యంగా మొదటి మ్యాచ్ ఆడిన అయ్యర్ అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచులో కూడా వీరిద్దరూ చెలరేగితే కోల్‌కతాకు తిరుగుండదు. రాహుల్ త్రిపాఠి , నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్, దినేష్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్ లాంటి స్టార్ బ్యాట్స్‌మన్‌ ఉండనే ఉన్నారు. ముంబైలో టాప్ -7లో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నందున కేకేఆర్ హర్భజన్ సింగ్ లేదా కుల్‌దీప్ యాదవ్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ బౌలింగ్ భారంను పంచుకోనున్నారు.

తుది జట్లు

తుది జట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్/కుల్‌దీప్ యాదవ్‌, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్)/అన్మోల్‌ప్రీత్ సింగ్, క్వింటన్ డికాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చహర్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.

బౌలర్లకు అనుకూలం

బౌలర్లకు అనుకూలం

అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలించనుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై కోల్‌కతా చెలరేగిన విషయం తెలిసిందే. వరుణ్ చక్రవర్తి రాణించాడు. ఈ రోజు కూడా స్పిన్నర్లు రాణించే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాట్స్‌మన్‌ క్రీజులో గడిపితే పరుగులు చేసే అవకాశం ఉంది. మ్యాచుకు ఎలాంటి వర్ష సూచన లేదు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోనుంది.

గత సీజన్‌లో రెండు గేమ్‌లలో కేకేఆర్.. ముంబై చేతిలో ఓడిపోయినప్పటికీ అబుదాబిలో మాత్రం వారి రికార్డు చాలా మెరుగ్గానే ఉంది. ఇక్కడ ఆడిన 6 మ్యాచుల్లో 5 గెలించింది. ఈ వేదిక వద్ద ఇతర జట్ల సగటు స్కోర్లు 155గా నమోదయ్యాయి. ముంబై గత సీజన్‌లో సగటున 187 పరుగులు సాధించింది. గత ఐదేళ్లలో ముంబైతో జరిగిన 12 మ్యాచ్‌లలో 1 మాత్రమే గెలిచిన ఇయోన్ మోర్గాన్ నాయకత్వంలోని కోల్‌కతా.. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ కంటే గట్టి సవాలును ఎదుర్కోనుంది.

డ్రీమ్ 11 టీమ్స్

డ్రీమ్ 11 టీమ్స్

టీమ్ 1: క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ రాణా, శుభమన్ గిల్, ఆండ్రీ రస్సెల్ (వైస్ కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.

టీమ్ 2: క్వింటన్ డికాక్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 22 - October 28 2021, 07:30 PM
ఆస్ట్రేలియా
శ్రీలంక
Predict Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, September 23, 2021, 16:33 [IST]
Other articles published on Sep 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X