ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 23న డబ్లూపీఎల్ రెండో సీజన్ ప్రారంభం కానుంది. బెంగళూరు, ఢిల్లీ వేదికగా 23 రోజుల పాటు లీగ్ సాగనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఢిల్లీ వేదికగా మార్చి 15న ఎలిమేనటర్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గత సీజన్ మాదిరిగానే ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ అయిదు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
అయితే ఐపీఎల్ తరహాలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ప్లేఆఫ్స్ ఉండవు. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌గా చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. కాగా, ఫైనల్‌తో కలిపి 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి 11 మ్యాచ్‌లకు బెంగళూరు, మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.

డబ్ల్యూపీల్ 2024 షెడ్యూల్:
ఫిబ్రవరి 23- ముంబయి ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
ఫిబ్రవరి 24- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ (బెంగళూరు)
ఫిబ్రవరి 25- గుజరాత్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్ (బెంగళూరు)
ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
ఫిబ్రవరి 27- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు)
ఫిబ్రవరి 28- ముంబయి ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (బెంగళూరు)
ఫిబ్రవరి 29- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
మార్చి 1- యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు)
మార్చి 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబయి ఇండియన్స్ (బెంగళూరు)
మార్చి 3- గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
మార్చి 4- యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగళూరు)
మార్చి 5- ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబయి ఇండియన్స్ (ఢిల్లీ)
మార్చి 6- గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 7- యూపీ వారియర్స్ vs ముంబయి ఇండియన్స్ (ఢిల్లీ)
మార్చి 8- ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
మార్చి 9- ముంబయి ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
మార్చి 10- ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 11- గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
మార్చి 12- ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 13- ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
మార్చి 15- ఎలిమినేటర్ (ఢిల్లీ)
మార్చి 17- ఫైనల్ (ఢిల్లీ)