కోల్‌కత్తా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ 8వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించి రెండోసారి టైటిల్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్ లో 26 బంతుల్లో 50 పరుగులు చేసిన రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.
2013లో జరిగిన ఐపీఎల్ పైనల్‌ల్లో కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి. వేదిక కూడా ఇదే కావడం విశేషం. అప్పుడు ఎలాగైతే చెన్నైపై ముంబై ఎలా విజయం సాధించిందో, ఇప్పుడూ అదే రీపీట్ అయింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు సాధించింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి, ఓటమి పాలైంది.
ముంబై ఇండియన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అనంతరం ప్రముఖుల వ్యాఖ్యలు:

రోహిత్ శర్మ - 'ఇదో గొప్ప ప్రయాణం. దీనికి మించి ఇంకేమీ అడగను. టైటిల్ పోరులో మా ఆటగాళ్లు బాగా ఆడారు. మరిచిపోలేని విజయం అందించారు'
రోహిత్ శర్మ - 'ఈడెన్‌లో ఎప్పుడూ మంచి ప్రదర్శనే కనబరుస్తాం... ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అలరించడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది'
మహేంద్ర సింగ్ ధోని - 'తమ జట్టు పూర్తిస్థాయిలో రాణించక పోవడం వల్లనే ఓడింది... మొహిత్ శర్మ వేసిన రెండో ఓవరే తమ కొంప ముంచింది'
సచిన్ టెండూల్కర్ - 'సంతోషంగా ఉంది. కష్టసమయాల్లో జట్టు సమిష్టిగా రాణించింది. అవసరమైన సమయంలో నా సలహాలు జట్టుకి ఇచ్చాను.'
సచిన్ టెండూల్కర్ - 'ఐపీఎల్‌లో ఆడేందుకు నేను ఇక్కడికి రాలేదు. అందరం కలిసి ప్రయాణించాం, ఐపీఎల్ 8 కోసం ఎంతో కష్టపడ్డాం... తామంతా ప్రణాళిక ప్రకారం నడుచుకున్నాం'
రికీ పాంటింగ్ - ' నా జీవితంలో ఈ గెలుపు ఎంతో ప్రత్యేకం. ఈ విజయమంతా ఆటగాళ్లదే. అయితే కొంచెం ఒత్తిడితో కూడుకున్నది. ఈ జట్టుతో భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉంది'
హర్భజన్ సింగ్ - 'చాలా అద్భుతంగా ఆడినందుకు గర్వకారణంగా ఉంది. జట్టు నన్ను మంచిగా రాణించాలని కోరుకుంది. భారత్ కోసం కూడా చక్కగా రాణిస్తాను.'
లతీష్ మలింగ - 'ముంబై ఇండియన్స్ తరుపున ప్రతి ఏడాది ఆడుతున్నా. ఆరంభం బాగలేకపోయినా, ముగ్గింపు చక్కగా ఇచ్చాం. ప్రతి ఒక్కరూ ట్వంటీ20ని బ్యాటింగ్ గేమ్‌గా అభివర్ణిస్తారు, కానీ మ్యాచ్‌లను బౌలర్స్ కూడా గెలిపిస్తారు.'
కీరన్ పోలార్డ్ - ' ఐపీఎల్‌లో ఆరంభం ముంబై ఇండియన్స్‌ని చూసిన ఎవరైనా ఇక్కడి వరకూ వస్తామని ఆలోచించరు. ఎవరైతే అలా నమ్మకుండా ఉంటారో వారికోసమే మేం ఇక్కడున్నాం. పెద్ద గేమ్స్‌ని చూసినట్లైతే, అనుభవం ఉన్న ఆటగాళ్లు చక్కగా రాణించారు. '