WPL 2023 : ముంబై అమ్మాయిల జెర్సీ ఇదే.. కొత్త స్టైల్ సూపర్ అంటున్న ఫ్యాన్స్!

మహిళల ఐపీఎల్‌కు అంతా సిద్ధమైంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ మహిళల జట్టు యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ జట్టు జెర్సీని విడుదల చేసింది.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు జెర్సీలాగే బ్లూ, గోల్డ్ మిక్స్‌లో ఉన్న ఈ జెర్సీకి కొంత ఆరెంజ్ రంగును కూడా జోడించారు. పురుషుల జట్టు జెర్సీలాగే బ్లూ కలర్‌ను మహిళల జెర్సీకి కూడా మెయిన్ కలర్‌గా ఎంచుకుందీ యాజమాన్యం. అయితే దీనికి ఆరెంజ్ కూడా చేరడంతో కొంత విభిన్నంగా కనపడుతోంది.
జెర్సీ ఫొటో వైరల్..
వచ్చే శనివారం నుంచి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన కొందరు కీలక ఆటగాళ్లు ట్రైనింగ్ సెషన్ కోసం ఇక్కడకు చేరుకున్నారు. ఈ మ్యాచ్ కోసం సిద్ధం అవుతున్న జట్టు యాజమాన్యం.. ముంబై జెర్సీని, కొత్త కిట్‌ను విడుదల చేసింది. ఈ జెర్సీ ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్న ముంబై ఫ్రాంచైజీ.. 'ముంబైలోని సూర్యుడు, సముద్రం, బ్లూ అండ్ గోల్డ్ కోసం.. మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ జెర్సీ' అని పోస్టు చేసింది. ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్.. కొత్తగా ఉన్నా ఈ జెర్సీ కూడా చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
పూజ ఆడుతుందా?
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ముంబై ఇండియన్స్ చాలా తెలివిగా పాల్గొంది. ఈ జట్టు పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తోంది. అయితే బౌలింగ్ కొంత బలహీనంగా ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిన పూజ వస్త్రాకర్.. ఈ జట్టు ఆడే తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం కూడా కష్టంగా కనిపిస్తోంది. ఆమెను వేలంలో రూ.1.9 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో కూడా పూజ ఆడలేదన్న సంగతి తెలిసిందే.
తొలి టైటిల్‌పై కన్ను..
ఈ జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సివర్ బ్రంట్, అమీలియా కెర్, పూజ వస్త్రాకర్, యాస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ తామే నెగ్గాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తోంది. దీని కోసమే జట్టులోని కీలక ఆటగాళ్ల కోసం ఇప్పటికే ట్రైనింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేసి సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తలపడుతున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications