న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టిమ్ పైన్ మిషన్ ఫెయిల్‌ అయింది: ట్రోల్ చేసిన ముంబై ఇండియన్స్

Mumbai Indians troll Tim Paine for not scoring a hundred

హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఓ గొప్ప అవకాశాన్ని కోల్పోయాడని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ పేర్కొంది. మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టిమ్ పైన్‌ టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను రెచ్చ‌గొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.

బాక్సింగ్ డే టెస్టులో విజయమెవరిదో!: భార‌త్‌కు 2 వికెట్లు.. ఆసీస్‌కు 141 రన్స్బాక్సింగ్ డే టెస్టులో విజయమెవరిదో!: భార‌త్‌కు 2 వికెట్లు.. ఆసీస్‌కు 141 రన్స్

రెండో రోజు ఆటలో భాగంగా టిమ్ పైన్ త‌న మాట‌ల‌తో రోహిత్ శర్మ దృష్టిని మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేశాడు. చాలా ఓపికగా ఆడుతూ పరుగులు సాధిస్తున్న రోహిత్ శర్మ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు తెగ ప్రయత్నించాడు. ఈ క్రమంలో "ఇప్పుడు రోహిత్ శర్మ సిక్స్ కొడితే నేను ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్‌కి మారిపోతా" అని టిమ్‌ పైన్ కవ్వించాడు.

పైన్ తన మాటలతో ఎంత రెచ్చగొట్టే ప్ర‌య‌త్నం చేసినప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి స‌హ‌నాన్ని కోల్పోలేదు. అనంతరం ఈ ఘటనపై రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ టిమ్‌ పైన్‌కు మంచి ఆఫర్‌ ఇచ్చాడు. "పైన్‌ ముంబై అభిమానిలా కనిపిస్తున్నాడు.. మూడో టెస్ట్‌లో సెంచరీ చేస్తే ముంబై జట్టులోకి తీసుకుంటాం" అని తెలిపాడు.

1
43625

అయితే ఈ వ్యాఖ్యలనే కోట్‌ చేస్తూ ముంబై ఇండియన్స్‌ జట్టు తమ అధికారిక ట్విటర్‌లో టిమ్ పైన్‌ మంచి అవకాశాన్ని కోల్పోయాడని ట్విట్టర్‌లో పేర్కొంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో పైన్‌ (26) జడేజా బౌలింగ్‌లో రిషభ్‌ పంత్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇదే విషయాన్నే ప్రస్తావిస్తూ టిమ్‌ పైన్‌ మిషన్‌ ఫెయిల్‌ అయిందంటూ ముంబై ట్విట్టర్‌లో పేర్కొంది.

Story first published: Saturday, December 29, 2018, 15:22 [IST]
Other articles published on Dec 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X